విజయవాడలోని 5 కోవిడ్ సెంటర్లపై వేటు
దిశ, వెబ్ డెస్క్: ప్రవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. విజయవాడలో ఐదు కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతి రద్దు చేసింది. రోగుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న సెంటర్లపై వేటు వేస్తోంది. రమేష్ హాస్పిటల్స్ వారి స్వర్ణ ప్యాలస్ హోటల్, డా. లక్ష్మీ నర్సింగ్ హోమ్ వారి ఎనికేపాడులోని హోటల్ అక్షయ, ఇండో బ్రిటిష్ హాస్పిటల్ వారి బెంజ్ సర్కిల్ లో హోటల్ […]
దిశ, వెబ్ డెస్క్: ప్రవేట్ కోవిడ్ కేర్ సెంటర్లపై ఏపీ ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. విజయవాడలో ఐదు కోవిడ్ కేర్ సెంటర్లకు అనుమతి రద్దు చేసింది. రోగుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో విచారణ చేపట్టి నిబంధనలకు విరుద్ధంగా, అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న సెంటర్లపై వేటు వేస్తోంది.
రమేష్ హాస్పిటల్స్ వారి స్వర్ణ ప్యాలస్ హోటల్, డా. లక్ష్మీ నర్సింగ్ హోమ్ వారి ఎనికేపాడులోని హోటల్ అక్షయ, ఇండో బ్రిటిష్ హాస్పిటల్ వారి బెంజ్ సర్కిల్ లో హోటల్ ఐరా, ఎన్ ఆర్ ఐ హీలింగ్ హ్యాండ్స్ మరియు ఆంధ్రా హాస్పిటల్స్ వారి సన్ సిటీ, కృష్ణ మార్గ్ కోవిడ్ సెంటర్ల అనుమతిని రద్దు చేసినట్టు తెలుస్తోంది.