టోక్యోలో.. కరోనా బాధితులకు రోబో సేవలు
దిశ, వెబ్ డెస్క్ : కరోనా ప్రభావం వల్ల ప్రపంచ దేశాలన్నీ గజగజ వణికిపోతున్నాయి. కరోనా బాధితులను రక్షించడానికి వైద్యులు, వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దాంతో వారిపై అధిక భారం పడుతోంది. ఇప్పటికే రెండు నెలలుగా వారు నిద్రలేని రాత్రులు గడుపుతూ.. కరోనా బాధితులకు సేవలు చేస్తున్నారు. వారిపై భారాన్ని తగ్గించడానికి టోక్యో ప్రభుత్వం రోబోలను వినియోగిస్తుంది. కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ.. లక్షణాలు మరీ సీరియస్ గా లేని బాధితులను, హోటల్ గదుల్లో ఉంచడంతో పాటు […]
దిశ, వెబ్ డెస్క్ : కరోనా ప్రభావం వల్ల ప్రపంచ దేశాలన్నీ గజగజ వణికిపోతున్నాయి. కరోనా బాధితులను రక్షించడానికి వైద్యులు, వైద్య బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దాంతో వారిపై అధిక భారం పడుతోంది. ఇప్పటికే రెండు నెలలుగా వారు నిద్రలేని రాత్రులు గడుపుతూ.. కరోనా బాధితులకు సేవలు చేస్తున్నారు. వారిపై భారాన్ని తగ్గించడానికి టోక్యో ప్రభుత్వం రోబోలను వినియోగిస్తుంది.
కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ.. లక్షణాలు మరీ సీరియస్ గా లేని బాధితులను, హోటల్ గదుల్లో ఉంచడంతో పాటు వారికి సకల ఏర్పాట్లు చేసింది జపాన్ ప్రభుత్వం. వారిని చూసుకోవడానికి నిత్యం డాక్టర్లు అందుబాటులో ఉంటారు. వారికి కావాల్సిన మెడిసన్, ఆహారం ఇవ్వడానికి, వారితో మాట్లాడటానికి రోబోలను వినియోగిస్తున్నారు. మాస్క్ పెట్టుకుని ఉన్న ‘పెప్పర్ ’ అనే రోబో హోటల్ లాబీలో నిలుచుని అక్కడికి వస్తున్న కరోనా బాధితులను పలకరిస్తుంది. ‘మాస్క్ తప్పక ధరించండి. మీరు వీలైనంత త్వరలోనే కోలుకుంటారు’ అని వారికి ధైర్యాన్నిస్తుంది. అంతేకాదు రోబోలు రెడ్ జోన్ ఏరియాలోనూ క్లీనింగ్ సేవలు చేస్తున్నాయి. జపాన్ వ్యాప్తంగా 10 వేలకు పైగా హోటల్ రూములను క్వారంటైన్ గదులుగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతానికి జపాన్ లో 14 వేల పాజిటివ్ కేసులుండగా, 448 మరణాలు సంభవించాయి.
Tags : corona virus, quarantine, japan, tokyo, robots, peppar,