‘స్థూపాన్ని అవమానించిన నాయకులకు ప్రజలు త్వరలోనే బుద్ది చెపుతారు’

దిశ, జనగామ: జిల్లా స్ఫూర్తి స్థూపాన్ని అవమానించిన అధికార పార్టీ నాయకులకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని జనగామ జిల్లా జేఏసీ నాయకులు అన్నారు. బుధవారం జనగామ ఉద్యమ చౌక్ లో జేఏసీ నాయకులు మంతెన మణి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో జనగామ జిల్లా జేఏసీ నాయకులు మంగళంపల్లి రాజు మాట్లాడుతూ.. జిల్లా ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన జిల్లా స్పూర్థి స్థూపం ఆవరణ అధికార పార్టీ శిలా ఫలకంతో, చెత్తా చెదారం తో, సిగ్నల్ లైట్ల […]

Update: 2021-09-29 07:25 GMT

దిశ, జనగామ: జిల్లా స్ఫూర్తి స్థూపాన్ని అవమానించిన అధికార పార్టీ నాయకులకు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని జనగామ జిల్లా జేఏసీ నాయకులు అన్నారు. బుధవారం జనగామ ఉద్యమ చౌక్ లో జేఏసీ నాయకులు మంతెన మణి అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో జనగామ జిల్లా జేఏసీ నాయకులు మంగళంపల్లి రాజు మాట్లాడుతూ.. జిల్లా ఉద్యమానికి స్ఫూర్తినిచ్చిన జిల్లా స్పూర్థి స్థూపం ఆవరణ అధికార పార్టీ శిలా ఫలకంతో, చెత్తా చెదారం తో, సిగ్నల్ లైట్ల స్తంభాలతో, చెత్త కుప్పలా తయారైందని అదిచూసిన తను ఆవేదన చెందానని అన్నారు.

ఉద్యమ కారులని చెప్పుకునే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు జనగామ జిల్లా ఉద్యమాన్ని ఎలా గౌరవించాలో తెలియదా అని ప్రశ్నించారు. జిల్లా ఆవిర్భావం సందర్భంగా గ్రామ గ్రామాన జేఏసీ కమిటీలు ఏర్పాటు చేసి జనగామ అభివృద్ధి కోసం మరో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు గన్ను కార్తీక్, జిల్లా కార్యదర్శి తుంగ కౌశిక్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News