పోలీసులకు ప్రజలు సహకరించాలి: సీపీ జోయల్ డేవిస్
దిశ, మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు పోలీసులకు సహకరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పిలుపునిచ్చారు. సోమవారం సీపీ మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణ కోసం కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. మనిషి జీవితంలో ప్రాణం కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ఆయన హితవు పలికారు. అవసరం లేకున్నా రోడ్లపై తిరిగే వాహనాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రతి […]
దిశ, మెదక్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్ నిబంధనలను పాటిస్తూ ప్రజలు పోలీసులకు సహకరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ పిలుపునిచ్చారు. సోమవారం సీపీ మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాధి నివారణ కోసం కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. మనిషి జీవితంలో ప్రాణం కంటే ముఖ్యమైనది మరొకటి లేదని ఆయన హితవు పలికారు. అవసరం లేకున్నా రోడ్లపై తిరిగే వాహనాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సీపీ సూచించారు. మాస్కులు ధరించని వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. లాక్‌డౌన్ నిబంధనలను పాటించని వ్యక్తులు, వ్యాపారస్తులపై ఇప్పటికే కేసులు నమోదు చేశామని సీపీ జోయల్ డేవిస్ గుర్తు చేశారు.
tag: CP Joel Davis, comments, People, cooperate, Police, Siddipet