పెట్రో ధరలు తగ్గించండి KTR సార్.. నెటిజన్లపై TRS నేతల ఓవరాక్షన్.!

దిశ, డైనమిక్ బ్యూరో : రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఉపశమనం కలిగించేలా కేంద్రం పెట్రో ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యాట్‌ను తగ్గిస్తే మరింత ఉపశమనం ఉంటుందని కేంద్రం పిలుపునిచ్చింది. కేంద్రం పిలుపుతో బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. కానీ, తగ్గింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం […]

Update: 2021-11-07 00:11 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రోజురోజుకూ పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి ఉపశమనం కలిగించేలా కేంద్రం పెట్రో ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలు తమ వ్యాట్‌ను తగ్గిస్తే మరింత ఉపశమనం ఉంటుందని కేంద్రం పిలుపునిచ్చింది. కేంద్రం పిలుపుతో బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి.

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించాలని ప్రజల నుంచి డిమాండ్ వస్తోంది. కానీ, తగ్గింపుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు. అయితే, మంత్రి కేటీఆర్ “Proud of my state Telangana being a huge contributor to Nation” అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. పెట్రో ధరలపై వ్యాట్ తగ్గించండి కేటీఆర్ సార్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే, దీనిపై కేటీఆర్ స్పందించనప్పటికీ టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కేటీఆర్‌కు వత్తాసు పలుకుతూ నెటిజన్లకు సమాధానం ఇస్తున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం పెట్రో ధరలు తగ్గించకుండా.. ఇలా వారి సపోర్టర్స్‌తో ఎందుకు తగ్గించాలంటూ ట్విట్టర్లో ఎదురుదాడి చేయడం ఎంతవరకు సమంజసం అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తు్న్నారు.

https://twitter.com/kcrfanboy/status/1457174675688099848?s=20

 

సార్ బస్సులో చిల్లర మరిచిపోయాను.. సజ్జనార్‌ హెల్ప్ కోరిన ప్రయాణికుడు.. చివరకు

 

Tags:    

Similar News