కేసీఆర్‌కు భారీ షాక్.. ఈటల మా దేవుడంటూ పాదాలకు పాలాభిషేకం..
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో ప్రస్తుతం హుజురాబాద్ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ప్రభుత్వం హుజురాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రలో 11వ రోజు సంచలన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఈటల అభిమానులు తమ అభిమానాన్ని చూపించారు. […]
దిశ ప్రతినిధి, కరీంనగర్ : రాష్ట్రంలో ప్రస్తుతం హుజురాబాద్ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలను అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు సీరియస్‌గా తీసుకున్నాయి. ప్రభుత్వం హుజురాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హుజురాబాద్‌లో ఆసక్తికర ఘటన వెలుగు చూసింది. ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్రలో 11వ రోజు సంచలన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.
జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలో ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో ఈటల అభిమానులు తమ అభిమానాన్ని చూపించారు. ఈటల రాజేందర్ రాజీనామాతోనే హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు కారణమైన ఈటల రాజేందర్ పాదాలను పాలతో కడిగారు విలాసాగర్ గ్రామస్తులు. ఈ రకంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే, నియోజకవర్గ ప్రజల కోసం ప్రభుత్వం పలు పథకాలను రచిస్తుంటే.. ప్రజలు మాత్రం ఈటలను సపోర్టు చేస్తుండటం రాజకీయ వర్గాల్లో హీట్‌ను పెంచుతోంది.