క్షమించడం నేర్చుకోమంటున్న పదేళ్ల కుర్రాడు.. ఫిదా అవుతున్న నెటిజన్లు
దిశ, ఫీచర్స్: జీవిత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారు. అయితే ఆ తప్పును సరిదిద్దుకోవడం ఎంత ముఖ్యమో, తప్పుచేసిన వ్యక్తిని క్షమించడం కూడా అంతే ప్రధానమని జెఫాన్ అనే ఓ పదేళ్ల బాలుడు చెబుతున్నాడు. చిన్న వయస్సులోనే ‘యాంగ్రీ మేనెజ్‌మెంట్’ సమస్యలతో పోరాడిన ఈ చిన్నోడు.. టెడ్‌ఎక్స్ టాక్‌లో క్షమాపణ శక్తిని నేర్చుకున్న తర్వాత ఒక హాట్ టెంపర్డ్ బాయ్ నుంచి ప్రశాంతమైన, సంతోషకరమైన మనిషిగా ఎలా మారిపోయాడో తన అనుభవాల్ని […]
దిశ, ఫీచర్స్: జీవిత కాలంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో తప్పు చేస్తారు. అయితే ఆ తప్పును సరిదిద్దుకోవడం ఎంత ముఖ్యమో, తప్పుచేసిన వ్యక్తిని క్షమించడం కూడా అంతే ప్రధానమని జెఫాన్ అనే ఓ పదేళ్ల బాలుడు చెబుతున్నాడు. చిన్న వయస్సులోనే ‘యాంగ్రీ మేనెజ్‌మెంట్’ సమస్యలతో పోరాడిన ఈ చిన్నోడు.. టెడ్‌ఎక్స్ టాక్‌లో క్షమాపణ శక్తిని నేర్చుకున్న తర్వాత ఒక హాట్ టెంపర్డ్ బాయ్ నుంచి ప్రశాంతమైన, సంతోషకరమైన మనిషిగా ఎలా మారిపోయాడో తన అనుభవాల్ని పంచుకున్నాడు.
‘బలహీనులు ఎన్నటికీ క్షమించలేరు. క్షమించడం బలవంతుడి లక్షణం’ అనే కొటేషన్ ప్రస్తావిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించాడు జెఫాన్. “ప్రజలు క్షమించడం మరచిపోతున్నారు. అది మానవ సంబంధాల మధ్య వ్యత్యాసం పెంచుతుంది. తప్పు చేసినవారికి ఆ తప్పులను ఎత్తిచూపి, మరోసారి అలాంటి పొరపాటు చేయకుండా వారిలో చైతన్యం పెంచాలి. అప్పుడే ప్రపంచం మరింత ప్రేమమయంగా మారుతుంది. క్షమించడం గొప్పవిషయమే కానీ, క్షమించబడటం ఇంకా ఉత్తమమైంది.
కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులతో పాటు ఎంతోమంది వ్యక్తులు మన తప్పులను ప్రేమతో క్షమిస్తారు. అంతేకాదు మరోసారి పొరపాట్లు చేయకూడదని చెబుతారు. నేను తప్పు చేశాను. నన్ను క్షమించండి. నేను మారతాను. నాకు ఒక అవకాశమివ్వండని అడిగిన వారిని నిస్సకోచంగా క్షమించాలి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ జీవితాన్ని, బంధాన్ని సరిదిద్దుకుంటారని ఆశించాలి. అంతేగానీ తప్పుల కారణంగా మానవ సంబంధాలను వదులుకోకండి. వారిలో మార్పు తీసుకరావడానికి ప్రయత్నించండి” అని జెఫాన్ ప్రసంగించాడు.