కరోనా తగ్గే వరకు ఇళ్ళలోనే ఉండండి
దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ తగ్గే వరకు ఇళ్లలో నుంచి ప్రజలెవరూ బయటకు రావొద్దని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. లాక్‌డౌన్ సందర్భంగా భైంసాతోపాటు, బెల్ తరోడా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద ఎస్పీ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడటం తమ బాధ్యత అని వివరించారు. లాక్‌డౌన్ ముగిసే వరకు జిల్లా ప్రజలు సహకరించాలని, అత్యవసర సమయంలో తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని కోరారు. ప్రభుత్వ […]
దిశ, ఆదిలాబాద్: కరోనా వైరస్ తగ్గే వరకు ఇళ్లలో నుంచి ప్రజలెవరూ బయటకు రావొద్దని నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు తెలిపారు. లాక్‌డౌన్ సందర్భంగా భైంసాతోపాటు, బెల్ తరోడా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద ఎస్పీ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు కాపాడటం తమ బాధ్యత అని వివరించారు. లాక్‌డౌన్ ముగిసే వరకు జిల్లా ప్రజలు సహకరించాలని, అత్యవసర సమయంలో తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని కోరారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. స్వీయ నియంత్రణతోనే కరోనా మహమ్మారిని తరిమి కొట్టవచ్చునని ప్రజలకు సూచించారు.కార్యక్రమంలో భైంసా డీఎస్పీ నర్సింగ్ రావు పాల్గొన్నారు.
tags ; corona, lockdown, people dont come outside, sp shashidhar raju