అంబేద్కర్ జయంతిని ఇంట్లోనే జరుపుకోవాలి

దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఎవరి ఇంట్లో వారు జరుపుకోవాలని, బయటకు రావొద్దని సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేదలను ఆదుకునేందుకు దాతలు నగదు రూపకంగా లేదా చెక్కు రూపకంగా విరాళాన్నిజిల్లా అధికారులకు అందించాలన్నారు. ప్రతిరోజు ప్రజలు, వ్యాపారవేత్తలు, యువజన సంఘాలు, పెద్దలు కొంతమంది వలస కూలీలకు, అనాథలకు భోజనాలు, పండ్లను అందజేసేందకు ముందుకు రావాలని ఏసీపీ పిలుపునిచ్చారు. వారంతట వారు స్వయంగా బయటకు […]

Update: 2020-04-13 10:04 GMT

దిశ, మెదక్: లాక్‌డౌన్ నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఎవరి ఇంట్లో వారు జరుపుకోవాలని, బయటకు రావొద్దని సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేదలను ఆదుకునేందుకు దాతలు నగదు రూపకంగా లేదా చెక్కు రూపకంగా విరాళాన్నిజిల్లా అధికారులకు అందించాలన్నారు. ప్రతిరోజు ప్రజలు, వ్యాపారవేత్తలు, యువజన సంఘాలు, పెద్దలు కొంతమంది వలస కూలీలకు, అనాథలకు భోజనాలు, పండ్లను అందజేసేందకు ముందుకు రావాలని ఏసీపీ పిలుపునిచ్చారు. వారంతట వారు స్వయంగా బయటకు వెళ్లి సాయం చేయరాదని, అందుకోసం రెవెన్యూ అధికారులు లేదా పోలీస్ అధికారులు, జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నగదు లేదా చెక్కు రూపంలో అందజేయాలని కోరారు. వచ్చిన డబ్బుతో పేదల అవసరానికి అనుగుణంగా నిత్యావసరాలు పంపిణీ చేస్తామన్నారు.కరోనా వ్యాధి నియంత్రణకు ప్రజలందరూ పోలీసులకు, ప్రభుత్వానికి సహకరించాలని సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ తెలిపారు.

tags: corona, lockdown, ambedkar jayanthi, don’t come out side, do home only, acp rameshwar

Tags:    

Similar News