అభయహస్తం రద్దు..అర్హులకు ఆసరా పింఛన్
దిశ, న్యూస్ బ్యూరో : స్వయం సహాయక సంఘాల సభ్యుల పింఛన్ కాంట్రిబ్యూషన్ (అభయహస్తం) రద్దు బిల్లుని సభ ఏకగ్రీవంగా అమోదించాలని కోరుతూ శాసన మండలిలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బిల్లు ప్రవేశ పెట్టారు. అభయహస్తం పథకం మహిళా సభ్యులకు చెల్లించాల్సిన మొత్తానికి వడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు. అలాగే అభయ హస్తంలోని సభ్యులు అసరా పింఛన్ తీసుకుంటున్నారని, మిగతా అర్హులందరికీ ఆసరా పింఛన్ ఇస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 23లక్షల28 వేల14 సభ్యులు.. ఎమ్మెల్సీలు […]
దిశ, న్యూస్ బ్యూరో : స్వయం సహాయక సంఘాల సభ్యుల పింఛన్ కాంట్రిబ్యూషన్ (అభయహస్తం) రద్దు బిల్లుని సభ ఏకగ్రీవంగా అమోదించాలని కోరుతూ శాసన మండలిలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు బిల్లు ప్రవేశ పెట్టారు. అభయహస్తం పథకం మహిళా సభ్యులకు చెల్లించాల్సిన మొత్తానికి వడ్డీతో సహా చెల్లిస్తామని తెలిపారు. అలాగే అభయ హస్తంలోని సభ్యులు అసరా పింఛన్ తీసుకుంటున్నారని, మిగతా అర్హులందరికీ ఆసరా పింఛన్ ఇస్తామని మంత్రి తెలిపారు.
రాష్ట్రంలో 23లక్షల28 వేల14 సభ్యులు..
ఎమ్మెల్సీలు జాఫ్రీ, జీవన్‌రెడ్డి అభయహస్తం రద్దుపై అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 23లక్షల28 వేల14 మంది అభయస్తంలో సభ్యులుగా ఉన్నరని తెలిపారు. అభయహస్తం పింఛన్ దారుల సంఖ్య 2లక్షల20 వేల12 మంది ఉన్నరన్నారు. వీరిలో 1లక్ష33వేల415 ఆసరా పింఛన్ తీసుకుంటున్నరని తెలిపారు. ఆసరా పింఛన్ రూ.2016 అయినందున అభయహస్తం పింఛన్ నుంచి ఆసరాలోకి మళ్లిస్తామని తెలిపారు. ఇతర రాష్ట్రాలలో కూడా అభయహస్తం, భీమా సదుపాయాలు విడివిడిగా ఉన్నయని తెలిపారు.
సురక్షిత మంచినీటికి రూపకల్పన
మిషన్ భగీరథ తెలంగాణ మహిళలు తాగునీటి కోసం ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో స్వచ్ఛమైన, సురక్షితమైన శుద్ధి చేసిన మంచినీటిని అందించడం కోసం ప్రభుత్వం రూపకల్పన చేసిందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరికీ వంద లీటర్ల నీరు,మున్సిపాలిటీల్లో 135 లీటర్లు, కార్పొరేషన్‌లో 150 లీటర్ల నీరు, పరిశ్రమలకు 10శాతం నీటిని అందించనున్నట్లు తెలిపారు.
Tags: Pension Contribution,23 lakhs 28 thousand 14 members of the state,
Minister Errebelli Dayakarrao