అభివృద్ధికి నిధులివ్వని సర్కార్.. ఆదుకున్న పెన్నా సిమెంట్
దిశ, తాండూరు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూర్ మండలం కరణ్ కోర్ట్ గ్రామంలో మజీద్ నుండి కోట వరకు పెన్నా సిమెంట్ యాజమాన్యం సౌజన్యంతో సుమారు రూ.23 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ వీణా హేమంత్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాండూర్ మండలం బెల్కటూర్ గ్రామం శివారులో ఉన్నటువంటి పెన్నా సిమెంట్ కర్మాగారం సౌజన్యంతో ఇట్టి రోడ్డు పనులను నిర్మాణం జరుపుతున్నట్టు తెలిపారు. ప్రజల అవసరాలు […]
దిశ, తాండూరు : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా తాండూర్ మండలం కరణ్ కోర్ట్ గ్రామంలో మజీద్ నుండి కోట వరకు పెన్నా సిమెంట్ యాజమాన్యం సౌజన్యంతో సుమారు రూ.23 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ వీణా హేమంత్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాండూర్ మండలం బెల్కటూర్ గ్రామం శివారులో ఉన్నటువంటి పెన్నా సిమెంట్ కర్మాగారం సౌజన్యంతో ఇట్టి రోడ్డు పనులను నిర్మాణం జరుపుతున్నట్టు తెలిపారు.
ప్రజల అవసరాలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాల్సిన రోడ్డు పనులను సిమెంట్ కర్మాగారం యాజమాన్యం చేయిస్తుండటం గమనార్హం. టీఆర్ఎస్ సర్కార్ నిధులు ఇవ్వకుండా ఓటు వేసి గెలిపించిన ప్రజలను పట్టించుకోవడం లేదని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పూర్తి గుంతలమయమైన రోడ్డును సీసీ రోడ్డుగా మారుస్తున్న పెన్నా సిమెంట్ యాజమాన్యానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.