అంతరిక్షం నుంచి కనిపిస్తున్న పెంగ్విన్ మలం!
భూమ్మీద ఎత్తుగా ఉన్నవాటిని అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తాయని కామెంట్ చేస్తుంటాం. ఇటీవల ఒక శాటిలైట్ తీసిన ఫొటోలో కనిపించినవి ఏమాత్రం ఎత్తుగా ఉండవు. కానీ అంతరిక్షం నుంచి కూడా కనిపించాయి. అంటార్కిటికాలో మనుషులకు దూరంగా నివసిస్తున్న పెంగ్విన్లు, శాటిలైట్‌ను తప్పించుకోలేకపోయాయి. అందుకే వాటి మలం మరకలు శాటిలైట్ నుంచి కనిపించాయి. అవి చూస్తే తెల్లని బల్లపరుపు మంచు మీద గోధుమ రంగులో కనిపించాయి. ఆ మలం మరకలను బట్టి అంటార్కిటికాలో నివసించే 20 శాతం పెంగ్విన్లు […]
భూమ్మీద ఎత్తుగా ఉన్నవాటిని అంతరిక్షం నుంచి కూడా కనిపిస్తాయని కామెంట్ చేస్తుంటాం. ఇటీవల ఒక శాటిలైట్ తీసిన ఫొటోలో కనిపించినవి ఏమాత్రం ఎత్తుగా ఉండవు. కానీ అంతరిక్షం నుంచి కూడా కనిపించాయి. అంటార్కిటికాలో మనుషులకు దూరంగా నివసిస్తున్న పెంగ్విన్లు, శాటిలైట్‌ను తప్పించుకోలేకపోయాయి. అందుకే వాటి మలం మరకలు శాటిలైట్ నుంచి కనిపించాయి. అవి చూస్తే తెల్లని బల్లపరుపు మంచు మీద గోధుమ రంగులో కనిపించాయి. ఆ మలం మరకలను బట్టి అంటార్కిటికాలో నివసించే 20 శాతం పెంగ్విన్లు అక్కడే ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
వాతావరణ మార్పుల దృష్ట్యా పెంగ్విన్ల సంఖ్య తగ్గిపోతోందని అందరూ కలవరపడుతున్న సమయంలో ఇలా అన్ని పెంగ్విన్లు ఒకేచోట పెరుగుతున్నాయన్న సంగతి కొంచెం ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే అన్నీ ఒకేచోట పెరిగితే ఆహార కొరత ఏర్పడే అవకాశం ఉంటుంది. శాస్త్రవేత్తల బృందాలు అంటార్కిటికా వెళ్లి పెంగ్విన్ల జాడ కనిపెట్టడం, వాటి గురించి సర్వే చేయడం కష్టం కాబట్టి ఇలా మలం మరకల అడుగుజాడల ద్వారా వాటి సంఖ్యను లెక్కించాలని ప్రయత్నిస్తున్నారు. మరక ఎంత మందంగా ఉంటే దాన్ని బట్టి పెంగ్విన్ల సంఖ్యను లెక్కగట్టడానికి బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే వారు ఒక అల్గారిథమ్‌ను కూడా రూపొందించారు. అయితే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్లు పంపిన ఫొటోల్లో మలం మరకలు ఇంత స్పష్టంగా కనిపిస్తాయని తాము ముందు ఊహించలేదని శాస్త్రవేత్త ఫిల్ ట్రాథన్ అంటున్నారు. పెంగ్విన్ల సంఖ్యను బట్టి మంచు కరిగే రేటును కూడా అంచనా వేయనున్నట్లు ఆయన తెలిపారు.