ఈ ATM పనిచేసేదెన్నడో… మా కష్టాలు తీరేదెప్పుడో..?
దిశ, ఆత్మకూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం పెంచికలపేట గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ATMతో తమకు ప్రయోజనం లేదని పెంచికలపేట, నీరుకుళ్ళ, కేశవపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే మండల కేంద్రంలోని ఏటీఎంలకు వెళ్ళవలసిన దుస్థితి నెలకొందన్నారు. పెంచికలపేట బస్టాండ్ ఆవరణలో ఏటీఎం ఏర్పాటు చేసి ఏండ్లు గడుస్తున్నా సరిగా పనిచేయడం లేదని, ఒకవేళ పనిచేస్తే అందులో డబ్బులు ఉండటం లేదన్నారు. కానీ, ఇప్పుడు ఆ […]
దిశ, ఆత్మకూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూర్ మండలం పెంచికలపేట గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ATMతో తమకు ప్రయోజనం లేదని పెంచికలపేట, నీరుకుళ్ళ, కేశవపూర్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.ఏటీఎం నుంచి నగదు తీసుకోవాలంటే మండల కేంద్రంలోని ఏటీఎంలకు వెళ్ళవలసిన దుస్థితి నెలకొందన్నారు. పెంచికలపేట బస్టాండ్ ఆవరణలో ఏటీఎం ఏర్పాటు చేసి ఏండ్లు గడుస్తున్నా సరిగా పనిచేయడం లేదని, ఒకవేళ పనిచేస్తే అందులో డబ్బులు ఉండటం లేదన్నారు. కానీ, ఇప్పుడు ఆ ఏటీఎం పూర్తిగా మూతపడిందన్నారు.
బ్యాంకులో రోజుల తరబడి నిరీక్షణ..
నీరుకుళ్ళ గ్రామం మధ్యలో మూడు గ్రామాలకు కలిపి యూనియన్ బ్యాంక్ ఒక్కటే ఉంది. ఏటీఎం పనిచేయకపోవడం వల్ల ఈ బ్యాంకు ద్వారా ఉపాధి హామీ డబ్బులు, సీజన్లో వరి ధాన్యం డబ్బుల కోసం ప్రజలు బ్యాంకులో పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. బ్యాంకుకు పెద్ద సంఖ్యలో వినియోగదారులు రావడంతో నగదు కోసం గంటలు తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. కరోనా టైంలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఈ బ్యాంకుకు గుంపులు గుంపులుగా రావడంతో కరోనా హాట్‌స్పాట్‌గా మారిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఏటీఎం సేవలను అందుబాటులోకి తేవాలి..
పెంచికలపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ఏటీఎం పనిచేయ్యక సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రజలకు ఏటీఎం ద్వారా నగదు తీసుకుందామంటే ఇబ్బందిగా మారింది. నగదు కోసం మండల కేంద్రానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కావున, యూనియన్ బ్యాంక్ మేనేజర్ వెంటనే స్పందించి గతంలో ఏర్పాటు చేసిన ఏటీఎం మిషన్‌లను సరిచేసి వెంటనే సేవలను అందుబాటులోకి తేవాలి.