RRR : ‘ఆర్‌‌ఆర్‌ఆర్’ డిజిటల్ రైట్స్‌పై అఫిషియల్ అనౌన్స్‌మెంట్!

దిశ, సినిమా : అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) డిజిటల్, శాటిలైట్ రైట్స్‌పై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. రాజమౌళి (SS Rajamouli ) డైరెక్షన్‌లో మల్టీస్టారర్‌గా తెరకెక్కిన మెగా ప్రాజెక్ట్‌‌కు సంబంధించి నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌‌ను దక్కించుకున్న పెన్ స్టూడియోస్.. ఈ విషయాలను అధికారికంగా వెల్లడించింది. డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్స్‌గా జీ5(తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ), నెట్‌ఫ్లిక్స్ (హిందీ) లను ప్రకటించిన సంస్థ.. శాటిలైట్ […]

Update: 2021-05-26 07:18 GMT

దిశ, సినిమా : అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కానున్న మోస్ట్ అవెయిటెడ్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) డిజిటల్, శాటిలైట్ రైట్స్‌పై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. రాజమౌళి (SS Rajamouli ) డైరెక్షన్‌లో మల్టీస్టారర్‌గా తెరకెక్కిన మెగా ప్రాజెక్ట్‌‌కు సంబంధించి నార్త్ ఇండియన్ థియేట్రికల్ రైట్స్‌‌ను దక్కించుకున్న పెన్ స్టూడియోస్.. ఈ విషయాలను అధికారికంగా వెల్లడించింది. డిజిటల్ స్ట్రీమింగ్ పార్టనర్స్‌గా జీ5(తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ), నెట్‌ఫ్లిక్స్ (హిందీ) లను ప్రకటించిన సంస్థ.. శాటిలైట్ పార్టనర్స్‌గా జీ సినిమా(హిందీ), స్టార్ మా(తెలుగు), స్టార్ విజయ్(తమిళ్), ఏసియానెట్(మలయాళం), స్టార్ (కన్నడ)ను ప్రకటించింది. కాగా ఫారిన్ లాంగ్వేజెస్(ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, టర్కిష్, స్పానిష్) డిజిటల్ స్ట్రీమింగ్‌ను నెట్‌ఫ్లిక్స్‌కు అప్పజెప్పింది. కాగా ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని తమ ద్వారా రిలీజ్ చేసే అవకాశాన్ని కల్పించినందుకు చిత్ర దర్శకుడు రాజమౌళితో పాటు నిర్మాత డీవీవీ దానయ్యకు పెన్ స్టూడియోస్ కృతజ్ఞతలు తెలియజేసింది.

Pen India acquires all-in-one rights of RRR

Tags:    

Similar News