కల్తీ విత్తన విక్రయదారులపై పీడీ యాక్ట్ నమోదు
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నకిలీ, కల్తీ విత్తనాలను విక్రయించే వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ కల్తీ విక్రయదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నకిలీ కల్తీ విత్తనాల అక్రమ సరఫరా చేస్తూ రైతులను మోసం చేస్తున్న ముగ్గురిపై రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాలతో బెల్లంపల్లి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. మరి కొంతమంది జాబితా సిద్ధం చేశారు. త్వరలో వీరిపై కూడా పీడీ యాక్ట్ అమలు చేయనున్నట్టు వారు […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : నకిలీ, కల్తీ విత్తనాలను విక్రయించే వారిపై పోలీసులు దృష్టి పెట్టారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ కల్తీ విక్రయదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నకిలీ కల్తీ విత్తనాల అక్రమ సరఫరా చేస్తూ రైతులను మోసం చేస్తున్న ముగ్గురిపై రామగుండం సీపీ సత్యనారాయణ ఆదేశాలతో బెల్లంపల్లి పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. మరి కొంతమంది జాబితా సిద్ధం చేశారు. త్వరలో వీరిపై కూడా పీడీ యాక్ట్ అమలు చేయనున్నట్టు వారు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పరిధిలో నకిలీ విత్తనాలు అక్రమ వ్యాపారం చేస్తున్నటువంటి పత్తి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఊస సుబ్బారావు, చౌదరి దినేష్ అనే ముగ్గురు పై పీడీ యాక్ట్ అమలు చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు మూడు వైపులా మహారాష్ర్ట సరిహద్దుగా ఉండగా మహారాష్ట్ర నుంచి నకిలీ కల్తీ విత్తనాలను తీసుకొస్తున్నారు అలాగే ఆంధ్రా ప్రాంతం నుంచి కూడా ఈ నకిలీ కల్తీ విత్తనాలు అక్రమంగా సరఫరా అవుతున్నాయి. స్థానికంగా ఉండే కొందరు ఏజెంట్లు వ్యాపారులు వీటిని రైతులకు అంట గడుతున్నారు. కొనుగోలు చేసిన రైతులు విత్తనాలు వేసిన తర్వాత మొలవక నష్టపోతున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ నిర్మల్ ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ కల్తీ విత్తనాల విక్రయాలపై పోలీసులు చర్యలు చేపడుతున్నారు. వ్యాపారులు ఏజెంట్లపై కేసులు కూడా నమోదు చేశారు. నకిలీ కల్తీ విత్తనాలు విక్రయించే వారి సమాచారం తెలపాలని వాట్సాప్ నెంబర్లను కూడా ఇచ్చారు.