సైబరాబాద్ సీపీ సీరియస్.. వారిపై పీడీ యాక్ట్ నమోదు

దిశ, శేరిలింగంపల్లి: నిషేధిత డ్రగ్స్, గంజాయి వ్యాపారులపై కొనసాగుతున్న డ్రైవ్‌ లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇద్దరు గంజాయి వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఎం. వేణు గోపాల్ రెడ్డి, డి. కసుమూరి రెడ్డి గత ఏడాది డిసెంబర్ 18న గంజాయి, నిషేధిత డ్రగ్స్ తరలిస్తూ రామచంద్రాపురం పోలీసులకు పట్టుబడ్డారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిపై […]

Update: 2021-11-23 04:39 GMT

దిశ, శేరిలింగంపల్లి: నిషేధిత డ్రగ్స్, గంజాయి వ్యాపారులపై కొనసాగుతున్న డ్రైవ్‌ లో భాగంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఇద్దరు గంజాయి వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఎం. వేణు గోపాల్ రెడ్డి, డి. కసుమూరి రెడ్డి గత ఏడాది డిసెంబర్ 18న గంజాయి, నిషేధిత డ్రగ్స్ తరలిస్తూ రామచంద్రాపురం పోలీసులకు పట్టుబడ్డారు. ప్రస్తుతం చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిపై గతంలోనూ ఈ తరహా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో మరోసారి ఇలాంటి నేరాలకు పాల్పడకుండా నిరోధించేందుకు గాను వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించినట్లు పేర్కొన్నారు.

కొనసాగుతున్న పోలీసుల స్పెషల్ డ్రైవ్

డ్రగ్స్‌ పై సైబరాబాద్ పోలీసుల స్టెప్ అప్ డ్రైవ్ కొనసాగుతోంది. గంజాయి వ్యాపారులపై నిరంతర దాడులు జరుగుతున్నాయి. సోమవారం గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 40.5 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 180 ఈ-పెట్టీ కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 11 మంది డ్రగ్స్ నేరస్థులపై పీడీ యాక్ట్ విధించారు.

Tags:    

Similar News