ఫ్లాష్ ఫ్లాష్ : హ్యాకర్లతో మా ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు : రేవంత్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బారికేడ్లను కాంగ్రెస్ కార్యకర్తలు తోసివేయగా పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ మీద తమకు నమ్మకం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శుక్రవారం నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. బారికేడ్లను కాంగ్రెస్ కార్యకర్తలు తోసివేయగా పోలీసులకు వారికి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ మీద తమకు నమ్మకం లేదని, ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తామని స్పష్టంచేశారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజలను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ‘హ్యాకర్లతో తమ ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారని’ ఆరోపించారు.
వచ్చేది సోనియా రాజ్యం, కాంగ్రెస్ కార్యకర్తల రాజ్యం అని రేవంత్ జోస్యం చెప్పారు. అంబేద్కర్ విగ్రహం వైపు కార్యకర్తలు భారీ ర్యాలీగా వెళ్తుండగా.. దానిని ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. అయితే, శాంతియుతంగా చేపడుతున్న ర్యాలీని అడ్డుకుని ‘మీరు ఇబ్బంది పడొద్దు.. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని’ పీసీసీ చీఫ్ సూచించారు. పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ఇందిరాపార్క్ సమీపంలోని ధర్నాచౌక్ వద్ద చేపట్టిన కాంగ్రెస్ ఆందోళనకు భారీగా కార్యకర్తలు, సీనియర్ నాయకులు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. కార్యక్రమంలో రేవంత్‌తో పాటు అంజన్ కుమార్ యాదవ్, పొన్నాల లక్ష్మయ్య, మధుయాష్కీ గౌడ్‌లను పోలీసులు అరెస్టు చేసి అంబర్ పేట్ పీఎస్‌కు తరలించారు.