పేటీఎం యూజర్లకు శుభవార్త

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల డిజిటల్ ఇండియాకు ఆరేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన డిజిటల్ చెల్లింపుల సేవల సంస్థ పేటీఎమ్ తాజాగా వినియోగదారులకు మరో శుభవార్త ప్రకటించింది. ‘పోస్ట్‌పెయిడ్ మినీ’ పేరున కొత్త సేవలను ప్రారంభించింది. ‘బై నౌ-పే లేటర్’ సేవలకు కొనసాగింపుగా దీన్ని భావించవచ్చని తెలిపింది. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ సంస్థతో భాగస్వామ్యం ద్వారా రూ. 250-1,000 వరకు చిన్న మొత్తంలో రుణాలను అందిస్తోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకొచ్చామని, […]

Update: 2021-07-05 11:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల డిజిటల్ ఇండియాకు ఆరేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన డిజిటల్ చెల్లింపుల సేవల సంస్థ పేటీఎమ్ తాజాగా వినియోగదారులకు మరో శుభవార్త ప్రకటించింది. ‘పోస్ట్‌పెయిడ్ మినీ’ పేరున కొత్త సేవలను ప్రారంభించింది. ‘బై నౌ-పే లేటర్’ సేవలకు కొనసాగింపుగా దీన్ని భావించవచ్చని తెలిపింది. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ సంస్థతో భాగస్వామ్యం ద్వారా రూ. 250-1,000 వరకు చిన్న మొత్తంలో రుణాలను అందిస్తోంది. ప్రస్తుతం కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకొచ్చామని, తీసుకున్న రుణాలను 30 రోజుల్లోగా తిరిగి చెల్లించవచ్చని వివరించింది.

పేటీఎమ్ సంస్థ ఇప్పటికే రూ. 60 వేల వరకు తక్షణ క్రెడిట్ రుణాలను అందిస్తోంది. ఇప్పుడు కొత్తగా నెలవారీ ఖర్చుల కోసం పోస్ట్‌పెయిడ్ మినీ ద్వారా కొత్త సేవలు ప్రారంభించింది. చిన్న మొత్తంలో తీసుకునే ఈ రుణాలకు ఎలాంటి ఫీజులు, యాక్టివేషన్ ఛార్జీలు ఉండవు. కనీస సౌలభ్య రుసుమును మాత్రమే విధిస్తున్నట్టు కంపెనీ తెలిపింది. కాగా, త్వరలో పేటీఎం సంస్థ ఐపీఓకు సిద్ధమవుతోంది. దీని ద్వారా రూ. 22 వేల కోట్ల నిధులను సమీకరించాలని పేటీఎమ్ నిర్ణయించింది.

Tags:    

Similar News