రైటర్‌గా.. పాయల్ రాజ్‌పుత్ !
దిశ, వెబ్ డెస్క్: ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్.. తొలి చిత్రంతోనే యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. వెంకటేష్‌తో ‘వెంకీమామ’లో ఆడిపాడిన ఈ అమ్మడు.. ‘డిస్కోరాజా’ సినిమాలో రవితేజకు జంటగా నటించి మెప్పించింది. ఇక క్వారంటైన్ టైమ్‌లో పిల్లో డ్రెస్, పేపర్ డ్రెస్‌లతో యువ హృదయాలను కొల్లగొట్టింది. కాగా పాయల్ క్రియేటివిటీపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. ఇవన్నీ పక్కనబెడితే సినిమా […]
దిశ, వెబ్ డెస్క్: ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్.. తొలి చిత్రంతోనే యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. వెంకటేష్‌తో ‘వెంకీమామ’లో ఆడిపాడిన ఈ అమ్మడు.. ‘డిస్కోరాజా’ సినిమాలో రవితేజకు జంటగా నటించి మెప్పించింది. ఇక క్వారంటైన్ టైమ్‌లో పిల్లో డ్రెస్, పేపర్ డ్రెస్‌లతో యువ హృదయాలను కొల్లగొట్టింది. కాగా పాయల్ క్రియేటివిటీపై సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివ్ కామెంట్లు కూడా వచ్చాయి. ఇవన్నీ పక్కనబెడితే సినిమా షూటింగ్స్ లేని లాక్‌డౌన్ సమయంలో.. పాయల్ రాజ్‌పుత్ ఓ సినిమాలో నటించి ఔరా అనిపించింది. అంతేకాదు ఈ సినిమాను 24 గంటల్లోనే పూర్తి చేయడం విశేషం.
ఆర్ఎక్స్100 సినిమా తర్వాత పెద్దగా హిట్ అందుకోలేని ఈ భామ.. సెలబ్రెటీలంతా ఇళ్లకే పరిమితమైన వేళ, ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఇదొక షార్ట్ ఫిల్మ్. ‘ఏ రైటర్ ’ పేరుతో వచ్చిన ఈ సినిమాను సౌరభ్ దింగ్రా తెరకెక్కించారు. లాక్‌డౌన్ సమయంలో గృహహింస ఎక్కువైందనే వార్తలు మనం చూస్తేనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ‘భర్త పెట్టే హింస వల్ల భార్య పడుతున్న ఇబ్బందులను’ దర్శకుడు సౌరభ్ ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. పాయల్ రాజ్‌పుత్ ఇందులో లీడ్ రోల్ పోషించారు. హౌజ్ వైఫ్‌గా ఉంటూనే, రైటర్‌గానూ ఆమె ఈ చిత్రంలో కనిపిస్తారు. 16 నిమిషాల నిడివితో నిర్మించిన ఈ చిత్రంలో పాయల్ మేకప్ లేకుండా నేచురల్‌గా నటించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌ను అన్నీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. కాగా పాయల్ చేసిన ఈ ప్రయత్నానికి ప్రశంసలు దక్కుతున్నాయి.