చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కల్యాణ్.. కీలక వ్యాఖ్యలు
దిశ, ఎల్బీనగర్: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి చైత్ర కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం పరామర్శించారు. బాధిత బాలిక కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. ఈ దారణం నన్ను కలచివేసింది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో ఈ ఘటన జరగడం దారుణం. దీనిపై ప్రభుత్వం […]
దిశ, ఎల్బీనగర్: హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి చైత్ర కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం సాయంత్రం పరామర్శించారు. బాధిత బాలిక కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘అందరం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. ఈ దారణం నన్ను కలచివేసింది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో ఈ ఘటన జరగడం దారుణం. దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. నిందితున్ని వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలి’’ అని తెలిపారు.
కాగా, చిన్నారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన పవన్ కల్యాణ్‌ను చూసేందుకు ఆయన అభిమానులు భారీగా తరలివచ్చారు. అభిమాన జన సందోహం దాటుకొని కుటుంబ సభ్యుల ఇంటి వద్దకు వద్దకు వెళ్లేందుకు పవన్‌కు వీలు కాలేదు. దీంతో కుటుంబ సభ్యులను పోలీసుల సాయంతో తన వద్దకే పిలిపించుకుని వారితో మాట్లాడారు. ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి తగిన న్యాయం జరిగే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం పోలీసులు నిందితున్ని కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.