పవన్ కల్యాణ్ ట్వీట్…జగన్ కోసమేనా?
దిశ ఏపీ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ మాధ్యమంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఈ ట్వీట్ ఎవరి కోసం చేశారు? అన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. ఈ ట్వీట్‌ని ఎవరికి అనుకూలంగా వారు అన్వయించుకుంటుండడం విశేషం. ఇంతకీ ఆ ట్వీట్లో పవన్ కల్యాణ్ ఏమన్నారంటే… “ఒక జాతి సరైన బాటలో నడవాలంటే, ఒక తెలివైనవాడు తెగించాలి. ఒక […]
దిశ ఏపీ బ్యూరో: ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ మాధ్యమంగా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఆసక్తి రేపుతోంది. ఇంతకీ ఈ ట్వీట్ ఎవరి కోసం చేశారు? అన్న ఆసక్తి అందర్లోనూ నెలకొంది. ఈ ట్వీట్‌ని ఎవరికి అనుకూలంగా వారు అన్వయించుకుంటుండడం విశేషం. ఇంతకీ ఆ ట్వీట్లో పవన్ కల్యాణ్ ఏమన్నారంటే…
“ఒక జాతి సరైన బాటలో నడవాలంటే, ఒక తెలివైనవాడు తెగించాలి. ఒక ధర్మం తిరిగి స్థాపించబడాలంటే, ఒక అధికారం తల తెగిపడాలి… ఒక వారసత్వం నదిలా ప్రవహించాలంటే, ఒక గురువు దీపంలా వెలగాలి. ఒక దేశం ఉద్ధరింపబడాలంటే, ఒక సందేహం యుద్ధం చెయ్యాలి. రాజ్యాన్ని సేవించినవాడు రాముడైతే, ఆ రాజ్యాన్ని సాధించిన వాడే పరశురాముడు” అన్నారు. ఇది వైరల్‌గా మారింది. పరశురాముడు ప్రజలందరికీ ధైర్యాన్ని, శక్తిని అందించాలని తాను కోరుకుంటున్నానని, గొప్ప దేశమైన భారత ఖ్యాతి తిరిగి నిలవాలని కోరుకుంటున్నానని పవన్ తన ట్వీట్లో వ్యాఖ్యానించారు.
ఇంతకీ ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేసింది? అంటే సమాధానం మాత్రం లేదు. అయితే ఈ ట్వీట్‌ను అధికార విపక్షాలు ఎవరికి వారే అన్వయించుకుంటుండడం విశేషం. అయితే ప్రస్తుత కరోనా, మిడుతల దండు, చైనా దుశ్చర్యల కష్టకాలంలో దేశాధినేతతో పాటు దేశంలోని అందరికీ ధైర్యాన్నివ్వాలంటూ ఆయన ట్వీట్ చేసినట్టు తెలుస్తోంది.