Breaking: భారీగా డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
రాష్ట్రంలో 66 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన సాగించేందుకు సీఎం చంద్రబాబు(Cm Chandrababu) ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్ని శాఖలను ప్రక్షాళన చేసుకుంటూ వచ్చింది. ఇందులో భాగంగా ఐఏఎస్, ఏపీఎస్‌లతో పాటు ఎస్పీలు, డీఎస్సీలను సైతం బదిలీలు చేసింది. తాజాగా డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేసింది. మొత్తం 68 మంది డిప్యూటీ కలెక్టర్ల(Deputy Collectors)ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వెయిటింగ్ లిస్టులో పలువురు అధికారులకు సైతం పోస్టింగులు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోస్టింగులు కల్పించింది. ఎన్నికలకు ముందు నంద్యాల ఎస్పీగా పని చేసిన ఐపీఎస్ అధికారి రఘువీర్ రెడ్డి(IPS officer Raghuveer Reddy)ని ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన అప్పటి నుంచి వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. తాజాగా ప్రభుత్వం పోస్టింగ్ కల్పించింది. ఐపీఎస్ రఘువీర్ రెడ్డిని అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజీ ప్రిన్సిపల్‌గా పోస్టింగ్ ఇస్తే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ః