గండికోట బాధితులను పట్టించుకోరా? -జనసేనాని 

దిశ, ఏపీ బ్యూరో: నీళ్లలో నానిపోతున్నారు. తాళ్ల పొద్దుటూరులో పురుగూపుట్రతో జనం బెంబేలెత్తుతున్నారు. అయినా గండికోట ముంపు బాధితులను పట్టించుకోరా? అని ఓ ప్రకటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిజర్వాయర్ ముంపు పరిధిలో ఉన్న తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామస్తులను వరద నీటి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. పరిహారం పూర్తి స్థాయిలో అందకపోవడం వల్లనే తాము నడుముల్లోతు నీళ్లలో ఇబ్బందులు పడుతున్నట్లు  ముంపు […]

Update: 2020-09-26 08:00 GMT

దిశ, ఏపీ బ్యూరో: నీళ్లలో నానిపోతున్నారు. తాళ్ల పొద్దుటూరులో పురుగూపుట్రతో జనం బెంబేలెత్తుతున్నారు. అయినా గండికోట ముంపు బాధితులను పట్టించుకోరా? అని ఓ ప్రకటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రిజర్వాయర్ ముంపు పరిధిలో ఉన్న తాళ్ళ ప్రొద్దుటూరు గ్రామస్తులను వరద నీటి నుంచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలన్నారు. పరిహారం పూర్తి స్థాయిలో అందకపోవడం వల్లనే తాము నడుముల్లోతు నీళ్లలో ఇబ్బందులు పడుతున్నట్లు ముంపు వాసులు చెబుతున్నట్లు ఆయన తెలిపారు.

వృద్ధులు, చంటి పిల్లలు, గర్భిణులు సైతం వరద నీటిలో చిక్కుకున్నట్లు వెల్లడించారు. రిజర్వాయర్‌‌ నీటి నిల్వపై సంయమనం పాటించాలన్నారు. నిర్వాసితులను బలవంతంగా కాకుండా వారు ఇష్టపూర్వకంగా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.

Tags:    

Similar News