TTD:‘తిరుమల విజన్-2047’.. ప్రతిపాదనలు ఆహ్వానించిన టీటీడీ

ఏపీలో ఇటీవల సీఎం చంద్రబాబు(CM Chandrababu) ‘స్వ‌ర్ణాంధ్ర‌ విజన్ – 2047’ డాక్యుమెంట్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

Update: 2024-12-20 03:32 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఇటీవల సీఎం చంద్రబాబు(CM Chandrababu) ‘స్వ‌ర్ణాంధ్ర‌ విజన్ – 2047’ డాక్యుమెంట్ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ‘స్వ‌ర్ణాంధ్ర‌ విజన్ – 2047’కి అనుగుణంగా తిరుమలలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి కోసం టీటీడీ(TTD) ప్రతిపాదనల‌ను ఆహ్వానించింది. పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించే వ్యూహాత్మక ప్ర‌ణాళిక‌తో ‘తిరుమల విజన్-2047’ను('Tirumala Vision-2047') టీటీడీ ప్రారంభించింది. ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రఖ్యాత ఏజెన్సీలను ఆహ్వానిస్తూ ప్రతిపాదనల‌ కోసం ఆర్ఎఫ్‌పీని విడుదల చేసింది.

ఇటీవ‌ల తిరుమ‌ల‌(Tirumala)లో జ‌రిగిన‌ సమావేశంలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, పర్యావరణ నిర్వహణ, వారసత్వ పరిరక్షణపై దృష్టి సారించాల‌ని టీటీడీ బోర్డు తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. తిరుమల అభివృద్ధిలో సాంప్రదాయాన్ని, ఆధునికత‌తో సమతుల్యం చేసుకోవాల్సిన అవసరాన్ని సీఎం చంద్ర‌బాబు తెలియ‌జేశారు. తిరుమల ఆధ్యాత్మికం, పవిత్రత, సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించి ముందుచూపుతో భ‌క్తుల‌కు సౌకర్యాలు, వసతిని మెరుగుప‌ర్చాల‌ని  పిలుపునిచ్చారు.

తిరుమల విజన్ డాక్యుమెంట్-2047 లక్ష్యాలివే..

*ఆధునిక పట్టణ ప్రణాళిక నిబంధ‌న‌ల‌ను అనుస‌రిస్తూ తిరుమల‌ పవిత్రతను పెంపొందించేందుకు శాశ్వ‌త‌మైన వ్యూహాలను అమ‌లు చేయ‌డం.

*ఉత్త‌మ‌మైన ప్ర‌ణాళిక‌లు, వారసత్వ పరిరక్షణ, పర్యావరణ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వడం.

*ప్ర‌పంచవ్యాప్తంగా తిరుమ‌ల‌ను రోల్ మోడ‌ల్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు.

*తిరుమల అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేయడం.

*ప్రస్తుత భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జోనల్ అభివృద్ధి ప్రణాళికను సవరించడం.

Tags:    

Similar News