TTD: తిరుమలలో మాజీ మంత్రి పొలిటికల్ కామెంట్స్.. టీటీడీ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు

తిరుమలలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-20 02:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో తెలంగాణ (Telangana) భక్తులపై వివక్ష చూపుతున్నారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Former Minister Srinivas Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, తాజాగా ఆయన వ్యాఖ్యలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (TTD Chairman BR Naidu) తీవ్ర స్థాయిలో స్పందించారు. తిరుమల (Tirumala) పవిత్ర క్షేత్రమని.. రాజకీయ వేదిక కాదని సీరియస్ అయ్యారు. కొండపై రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిని ఉపేక్షించబోమని అన్నారు. బీఆర్ఎస్ (BRS) నేత చేసిన వ్యాఖ్యలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ (Srinivas Goud)పై చర్యలకు ఆదేశించామని బీఆర్ నాయుడు పేర్కొన్నారు.

కాగా, తిరుమల (Tirumala)లో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా స్వామి వారు అందరికీ చెందిన వాడని, తెలంగాణ (Telangana)లో పుట్టిన ప్రతి బిడ్డ శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకుంటారని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కూడా తిరుమలలో తెలంగాణ భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారని, వైసీపీ (YCP) ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి వివక్ష లేదన్నారు. కానీ, ఇటీవల కాలంలో తెలంగాణ భక్తులపై వివక్ష చూపుతున్నారని కామెంట్ చేశారు. సాధారణ ప్రజలతో పాటు, రాజకీయ, వ్యాపార వేత్తల విషయంలో వివక్ష కొనసాగుతోందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు

Tags:    

Similar News