పవన్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే అప్‌డేట్!
దిశ, వెబ్‌డెస్క్: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెప్తే అభిమానులు పొంగిపోతుంటారు. ఆయన సేవలు దేవుడిని చేస్తే.. ఆయన యాటిట్యూడ్ మరెందరికో స్ఫూర్తినిచ్చింది. ఇక యాక్టింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాలా? ట్రెండ్ సెట్టర్ అంతే. ఒక్కసారి పవర్‌స్టార్ బిగ్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. థియేటర్లు విజిల్స్‌తో దద్దరిల్లాల్సిందే, గాల్లో పేపర్లు ఎగరాల్సిందే. మెడమీద చేయి వేసి ఒక్క లుక్ ఇస్తే చాలు.. అరుపులు, కేకలు. అందుకే ఆ హీరోయిజాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షోలో చూసేందుకు […]
దిశ, వెబ్‌డెస్క్: పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు చెప్తే అభిమానులు పొంగిపోతుంటారు. ఆయన సేవలు దేవుడిని చేస్తే.. ఆయన యాటిట్యూడ్ మరెందరికో స్ఫూర్తినిచ్చింది. ఇక యాక్టింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాలా? ట్రెండ్ సెట్టర్ అంతే. ఒక్కసారి పవర్‌స్టార్ బిగ్ స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. థియేటర్లు విజిల్స్‌తో దద్దరిల్లాల్సిందే, గాల్లో పేపర్లు ఎగరాల్సిందే. మెడమీద చేయి వేసి ఒక్క లుక్ ఇస్తే చాలు.. అరుపులు, కేకలు. అందుకే ఆ హీరోయిజాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షోలో చూసేందుకు చాలా మంది ఆరాటపడుతుంటారు.
Yesssss!
The Update you're looking for is Here!
September 2nd – 4:05 PM 😊
POWERSTAR @PawanKalyan @harish2you 💥
— Mythri Movie Makers (@MythriOfficial) August 31, 2020
అయితే, ఇన్నాళ్లు రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్.. సినిమాల్లో కనిపించకపోవడంతో కాస్త నిరాశపడిన ఫ్యాన్స్ ‘పింక్’ రీమేక్‌తో రీఎంట్రీ ఇస్తున్నారని తెలిసి సంబురాలు జరుపుకున్నారు. కానీ లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడగా మళ్లీ రిలీజ్‌కు టైమ్ పట్టేలా ఉంది. కాగా, సెస్టెంబర్ 2న పవన్ సినిమా అప్‌డేట్ ఉంటుందనే న్యూస్.. ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా రానుండగా.. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను సెప్టెంబర్ 2 సా. 4.05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఇలా అప్‌డేట్ అని వచ్చిందో లేదో ఈ న్యూస్‌ను ట్రెండ్ చేసేశారు ఫ్యాన్స్.