పవన్‌కు ఖమ్మం కార్డియాలజిస్ట్ ట్రీట్మెంట్..
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఈనెల 3వ తేదీన తిరుపతి ప్రచారంలో పాల్గొన్న పవన్ ఆ తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. కరోనా సోకిందేమో అని తొలుత టెస్టులు చేయించుకోగా, నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో పవన్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను అపోలో ఆస్పత్రి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. అన్నయ్య చిరుతో పాటు కుటుంబసభ్యులు కూడా పవన్ ఆరోగ్యంపై […]
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యం బారిన పడిన విషయం తెలిసిందే. ఈనెల 3వ తేదీన తిరుపతి ప్రచారంలో పాల్గొన్న పవన్ ఆ తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. కరోనా సోకిందేమో అని తొలుత టెస్టులు చేయించుకోగా, నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో పవన్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఆయన ఆరోగ్య స్థితిగతులను అపోలో ఆస్పత్రి వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
అన్నయ్య చిరుతో పాటు కుటుంబసభ్యులు కూడా పవన్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్‌కు ఖమ్మం జిల్లాకు చెందిన వైరల్ వ్యాధుల నిపుణులు, కార్డియాలజిస్ట్ తంగెళ్ల సుమన్ హైదరాబాద్‌కు చేరుకుని పవన్ కళ్యాణ్ కు చికిత్స అందిస్తున్నారు. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో పవన్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు, పవన్ ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడంతో యాంటివైరల్ మందులతో చికిత్స అందిస్తున్నట్లు జనసేర రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.