తాట తీసి మోకాళ్లపై కూర్చోబెడతాం.. జాగ్రత్త: పవన్ హెచ్చరిక
దిశ, ఏపీ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఢంకా భజాయించబోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పవన్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని ఈ విషయంపై తేల్చుకునేందుకు వైసీపీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తాట తీసి మోకాళ్లపై కూర్చోబెడతామని పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఏ వైసీపీ నాయకుడు ఇబ్బంది పెడుతున్నాడో అవన్నీ గుర్తుపెట్టుకోవాలని దానికి బదులివ్వాలని […]
దిశ, ఏపీ బ్యూరో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ ఢంకా భజాయించబోతుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పవన్ స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో జనసేన గెలుస్తుందని ఈ విషయంపై తేల్చుకునేందుకు వైసీపీ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. తాట తీసి మోకాళ్లపై కూర్చోబెడతామని పవన్ కల్యాణ్ వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఏ వైసీపీ నాయకుడు ఇబ్బంది పెడుతున్నాడో అవన్నీ గుర్తుపెట్టుకోవాలని దానికి బదులివ్వాలని పవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వశాఖలకు విజ్ఞప్తి చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వాలు మారబోతున్నాయని ఇది రాసిపెట్టుకోవాలని సూచించారు. ఇప్పటి వరకు వైసీపీకి కౌరవ సభ చూపించామని రాబోయే రోజుల్లో పాండవ సభ ఏంటో చూపిస్తామని ఘాటుగా హెచ్చరించారు.