జగన్‌రెడ్డికి ఎందుకంత భయం : పవన్

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ.. జనసేన-బీజేపీ పార్టీలు ఇవాళ ఛలో రామతీర్థానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్టులు చేశారు. ఈ క్రమంలో, ఛలో రామతీర్థం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏపీ పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… జగన్‌ రెడ్డి ప్రభుత్వానికి […]

Update: 2021-01-05 06:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా రామతీర్థం ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ.. జనసేన-బీజేపీ పార్టీలు ఇవాళ ఛలో రామతీర్థానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ ఇరు పార్టీల నేతలను హౌస్ అరెస్టులు చేశారు. ఈ క్రమంలో, ఛలో రామతీర్థం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఏపీ పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… జగన్‌ రెడ్డి ప్రభుత్వానికి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. రామతీర్థ ధర్మయాత్రను అడ్డుకోవడం అప్రజాస్వామికం అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలియజేయడం ప్రతిఒక్కరి హక్కు అని గుర్తుచేశారు. శాంతియుతంగా నిరసన తెలిపుతుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణం అన్నారు. అయినా జనసైనికులు ఎక్కడా తగ్గకుండా రామతీర్థం కొండకు చేరుకోవడం నిజంగా అభినందనీయం తెలిపారు.

Tags:    

Similar News