జనసేన నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన పవన్ కల్యాణ్
దిశ, ఏపీ బ్యూరో: జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర కార్యవర్గంతో పాటు పలు జిల్లాలకు అధ్యక్ష, కార్యదర్శులను నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలోకి చల్లా మదుసూధన్‌రెడ్డి, విజయ్ కుమార్‌లను తీసుకున్నారు. లీగల్ సెల్ చైర్మన్‌గా ప్రతాప్, డాక్టర్ సెల్‌చైర్మన్‌గా బొడ్డేపల్లి రఘుకు అవకాశం కల్పించారు. అలాగే ఐటీ సెల్ చైర్మన్‌గా మిరియాల శ్రీనివాస్, మత్స్యకార వికాస విభాగం చైర్మన్‌గా బొమ్మిడి నాయకర్‌లను ప్రభుత్వం నియమించింది. అలాగే చేనేత వికాస విభాగం […]
దిశ, ఏపీ బ్యూరో: జనసేన రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రాష్ట్ర కార్యవర్గంతో పాటు పలు జిల్లాలకు అధ్యక్ష, కార్యదర్శులను నియమించారు. రాష్ట్ర కార్యవర్గంలోకి చల్లా మదుసూధన్‌రెడ్డి, విజయ్ కుమార్‌లను తీసుకున్నారు. లీగల్ సెల్ చైర్మన్‌గా ప్రతాప్, డాక్టర్ సెల్‌చైర్మన్‌గా బొడ్డేపల్లి రఘుకు అవకాశం కల్పించారు. అలాగే ఐటీ సెల్ చైర్మన్‌గా మిరియాల శ్రీనివాస్, మత్స్యకార వికాస విభాగం చైర్మన్‌గా బొమ్మిడి నాయకర్‌లను ప్రభుత్వం నియమించింది. అలాగే చేనేత వికాస విభాగం చైర్మన్‌గా చిల్లపల్లి శ్రీనివాస్, పార్టీ ప్రోగ్రామ్స్ కో-ఆర్డినేటర్‌గా కళ్యాణం శివ శ్రీనివాస్‌ను నియమించింది.
జిల్లా అధ్యక్షుల వివరాలివే :
రాష్ట్రంలోని పలు జిల్లాలకు నూతన అధ్యక్షులను పవన్ కల్యాణ్ ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా కందుల దుర్గేష్, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడిగా గోవింద్, కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా బి.రామకృష్ణ, విజయవాడ నగర అధ్యక్షుడిగా పోతిన వెంకట మహేష్, గుంటూరు జిల్లా అధ్యక్షుడుగా గాదె వెంకటేశ్వరరావు, ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా షేక్ రియాజ్, అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా టీసీ వరుణ్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా పసుపులేటి హరిప్రసాద్, నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డిలను నియమించారు. పార్టీ కార్యదర్శిగా అమ్మిశెట్టి వాసులను నియమించారు. అలాగే 17 మంది పార్టీ కార్యదర్శులు, 13 మంది జాయింట్ సెక్రటరీలను నియమించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు.