పట్టణ ప్రగతి.. ‘ఫైనాన్స్’ కోసమేనా?

దిశ, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి పట్టణాల ప్రగతి సడెన్‌గా గుర్తుకు రావడానికి కారణమేమై ఉంటుంది.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో ఎప్పుడూలేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పట్టణ ప్రగతి పేరుతో సోమవారం నుంచి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి సిద్ధమైంది. అదీ మున్సిపల్ ఎన్నికలు గడిచిన తర్వాత ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే, దీని వెనుక కేంద్ర ఆర్థిక సంఘం నిధులు వృథా కాకూడదన్న ప్రభుత్వ వ్యూహం ఉన్నట్లు […]

Update: 2020-02-24 07:23 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వానికి పట్టణాల ప్రగతి సడెన్‌గా గుర్తుకు రావడానికి కారణమేమై ఉంటుంది.. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో ఎప్పుడూలేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పట్టణ ప్రగతి పేరుతో సోమవారం నుంచి మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపట్టడానికి సిద్ధమైంది. అదీ మున్సిపల్ ఎన్నికలు గడిచిన తర్వాత ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తుండడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అయితే, దీని వెనుక కేంద్ర ఆర్థిక సంఘం నిధులు వృథా కాకూడదన్న ప్రభుత్వ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. పట్టణ ప్రగతిలో భాగంగా జీహెచ్ఎంసీకి ప్రతినెలా 78 కోట్ల రూపాయలు, రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలన్నింటికి కలిపి 70 కోట్ల రూపాయలు, మొత్తంగా అన్ని మున్సిపాలిటీలకు ప్రతి నెల 148 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ ఈ నెల 18న ప్రగతిభవన్‌లో నిర్వహించిన మున్సిపాలిటీల ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. జీహెచ్ఎంసీకి రూ.300 కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు రూ.500 కోట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇవన్నీ కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు విడుదల చేసే నిధులే కావడం విశేషం. ఆర్థిక మాంద్యం వల్ల సంక్షేమం, అభివృద్ధికి నిధులు కేటాయించలేకపోతున్నామని చెప్తున్న ప్రభుత్వానికి మాంద్యం ఉన్న ఈ ఏడాదే గత 6 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా పల్లె, పట్టణ ప్రగతులు గుర్తు రావడం వెనుక స్థానిక సంస్థల అభివృద్ధి మీద శ్రద్ధ కంటే ఆర్థిక సంఘం నిధుల మీద ప్రేమే ఎక్కువ కనిపిస్తోందని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.

కేంద్రానిదేమీ లేదన్నట్లుగా ప్రచారం

పట్ణణ ప్రగతికి కేంద్ర ఆర్థిక సంఘం నిధులను వాడుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఏమీ ఇవ్వలేదన్నట్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. ఈ కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న శానిటరీ వర్క్స్, డ్రైనేజీల నిర్మాణం తదితర పనులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే స్వచ్ఛ భారత్ లాంటి పలు పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వానికి నిధులిచ్చింది. ఆ నిధులు సైలెంట్‌గా వాడుకొని ఇప్పుడు మళ్లీ అవే పనులకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులతో పట్టణ ప్రగతి పేరిట ప్రత్యేక కార్యక్రమం రూపొందించింది. ఈ కార్యక్రమం 10 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 140 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరుగుతుండడంతో గులాబీ పార్టీకి పట్టణాల అభివృద్ధికి సంబంధించి మొత్తం క్రెడిట్ కొట్టేసే అవకాశం, ఆలోచన ఉందనేది విశ్లేషకుల వాదన. పైగా మున్సిపాలిటీల మంత్రిగా సీఎం కుమారుడైన కేటీఆరే ఉండడం కూడా ఈ కార్యక్రమానికి ఇంత పబ్లిసిటీ జరగడానికి కారణమని వారంటున్నారు.

మున్సిపాలిటీల పేరెత్తినపుడల్లా డబుల్ తలనొప్పి

టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు మున్సిపాలిటీల పేరెత్తినా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల హామీ ఏమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. డబుల్ బెడ్‌రూమ్‌లు ఇవ్వకపోగా కేంద్ర ప్రభుత్వ ఇళ్ల పథకమైన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరైన నిధులను కూడా పేదలకు దక్కకుండా చేశారని అవి ప్రభుత్వం మీద దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్‌ల హామీ 6 ఏళ్ల నుంచి అమలుకాని అంశాన్ని ఆధారంగా చేసుకొనే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పట్టణ గోస అనే నిరసన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే.

Read Also..

పల్లెలు హిట్.. ఇక పట్టణాలపై లుక్

Full View

Tags:    

Similar News