డీఎస్ బాటలో మరో మాజీ ఎమ్మెల్యే.. పుంజుకోనున్న కాంగ్రెస్
దిశ, ప్రతినిధి మెదక్: 2004 శాసన సభ ఎన్నికల్లో మెదక్ శాసన సభ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పట్లోళ్ళ శశిధర్ రెడ్డి గెలుపొందారు. ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. రాజ్యసభ సభ్యుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు డి, శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నందున, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డితో పాటు, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆ దిశగా మాజీ ఎమ్మెల్యే పావులు కదుపు తున్నారు. ఈ మేరకు డియస్‌తో […]
దిశ, ప్రతినిధి మెదక్: 2004 శాసన సభ ఎన్నికల్లో మెదక్ శాసన సభ నియోజక వర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పట్లోళ్ళ శశిధర్ రెడ్డి గెలుపొందారు. ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. రాజ్యసభ సభ్యుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు డి, శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నందున, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డితో పాటు, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆ దిశగా మాజీ ఎమ్మెల్యే పావులు కదుపు తున్నారు. ఈ మేరకు డియస్‌తో ఫోన్లో సంప్రదించినట్లు సమాచారం. శశిధర్ రెడ్డికి నియోజక వర్గంలో అన్ని గ్రామాలలో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇంత కాలం బీజేపీలో కొనసాగిన శశిధర్ రెడ్డి, బీజేపిలోకి విజయశాంతి చేరికతో ఆపార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని సమాచారం.
కాంగ్రెస్‌లో విజయ శాంతి మెదక్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు శశిధర్ రెడ్డి ఆమెకు వ్యతిరేకంగా పని చేసి ఓడించారని స్వయంగా విజయ శాంతి కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా వుండగా విజయశాంతి బీజేపీలో చేరడంతో గత కొద్ది కాలంగా శశిధర్ రెడ్డి బీజేపీ పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారం రోజుల్లో శశిధర్ రెడ్డి ఆయన అనుచరులతో సమావేశం నిర్వహించి భవిషత్ కార్యాచరణ గురించి చర్చించనున్నారు.