MGMలో శవజాగారం.. కానరాని వైద్యులు

దిశ, వెబ్‌డెస్క్ :వరంగల్ మహత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి (mgm)లో దారుణం జరిగింది. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులు చనిపోతున్నా వైద్యులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కొవిడ్ వార్డుల్లో మరణించిన వారి బాడీలను తరలించడం లేదని.. అలానే బెడ్స్ మీద ఉంచుతున్నట్లు సమాచారం. పట్టించుకునే వారు లేక ఎక్కడి శవాలు అక్కడే ఉంటున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. కొవిడ్ వార్డులో వైద్యులు, సిబ్బంది కన్పించడం లేదని.. బాధితుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. […]

Update: 2020-08-09 10:33 GMT

దిశ, వెబ్‌డెస్క్ :వరంగల్ మహత్మాగాంధీ మెమోరియల్ ఆస్పత్రి (mgm)లో దారుణం జరిగింది. కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న బాధితులు చనిపోతున్నా వైద్యులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. కొవిడ్ వార్డుల్లో మరణించిన వారి బాడీలను తరలించడం లేదని.. అలానే బెడ్స్ మీద ఉంచుతున్నట్లు సమాచారం.

పట్టించుకునే వారు లేక ఎక్కడి శవాలు అక్కడే ఉంటున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. కొవిడ్ వార్డులో వైద్యులు, సిబ్బంది కన్పించడం లేదని.. బాధితుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

ఓ ఘటనలో చనిపోయిన వృద్ధుడి మృతదేహాన్ని సిబ్బంది కిందపడేశారని, బెడ్ పై మరో వృద్ధురాలి శవం ఉందని, కోవిడ్ వార్డులో వెంటిలేటర్లు, వసతులు ఎక్కడా కన్పించడం లేదని రోగులు చెబుతున్నారు. వైద్యారోగ్య మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష తర్వాత కూడా ఎంజీఎంలో పరిస్థితులు ఏ మాత్రం మారకపోవడం ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News