ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ రేసులో పతంజలి?

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ స్పాన్సర్‌(title sponsor) నుంచి చైనా మొబైల్ కంపెనీ వివో(vivo) తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ(bcci) వేట ప్రారంభించింది. జియో(jio), అమెజాన్(amazon), టాటా గ్రూప్(tata group) వంటి సంస్థలు బిడ్లు దాఖలు చేస్తాయని వార్తలు వచ్చినా అవి నిర్ధారణ కాలేదు. అనూహ్యంగా బాబా రాందేవ్‌కు చెందిన ఆయుర్వేద(avurveda) ఉత్పత్తుల సంస్థ ‘పతంజలి’( patanjali) ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా టెండర్ (bid) వేయనున్నట్లు స్పష్టమవుతున్నది. ఇండియాలో పతంజలి ఉత్పత్తులు […]

Update: 2020-08-10 06:11 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ స్పాన్సర్‌(title sponsor) నుంచి చైనా మొబైల్ కంపెనీ వివో(vivo) తప్పుకోవడంతో కొత్త స్పాన్సర్ కోసం బీసీసీఐ(bcci) వేట ప్రారంభించింది. జియో(jio), అమెజాన్(amazon), టాటా గ్రూప్(tata group) వంటి సంస్థలు బిడ్లు దాఖలు చేస్తాయని వార్తలు వచ్చినా అవి నిర్ధారణ కాలేదు.

అనూహ్యంగా బాబా రాందేవ్‌కు చెందిన ఆయుర్వేద(avurveda) ఉత్పత్తుల సంస్థ ‘పతంజలి’( patanjali) ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా టెండర్ (bid) వేయనున్నట్లు స్పష్టమవుతున్నది. ఇండియాలో పతంజలి ఉత్పత్తులు చాలా ఆదరణ పొందాయి. ఈ క్రమంలో సంస్థ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని కంపెనీ భావిస్తోంది.

దీనికి ఐపీఎల్(ipl) సరైన వేదికని, పతంజలి ఉత్పత్తులను మరో స్థాయికి తీసుకెళ్లడానికి ఐపీఎల్ బ్రాండ్ కూడా ఉపయోగపడుతుందని పతంజలి అధికార ప్రతినిధి ఎస్కే తిజారావాలా వెల్లడించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు బీసీసీఐకి పంపినట్లు చెప్పారు. వివో (vivo) ఏడాదికి రూ.440కోట్లు బీసీసీఐకి చెల్లించేది. అయితే, పతంజలి అంత మొత్తం చెల్లిస్తుందా? లేదా అనేది తెలియరాలేదు.

మరోవైపు ఈ ఒక్క ఏడాదికే పతంజలి బిడ్ వేస్తుందా లేదా వివో వదులుకున్న మూడేళ్లకు వేస్తుందా అనేది కూడా స్పష్టం కాలేదు. కాగా, ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఈ మెగా లీగ్‌తో కలవడం వల్ల ఐపీఎల్ కంటే పతంజలికే ఎక్కువ లాభం చేకూరుతుందని విశ్లేషకులు(experts) భావిస్తున్నారు.

Tags:    

Similar News