క్వారంటైన్ కేంద్రంపై నిర్లక్ష్యం.. తహసీల్దార్ సస్పెన్షన్
దిశ, మెదక్: కరోనా బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పటాన్‌చెరు తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పటాన్‌చెరు సమీపంలోని పాటి నారాయణ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో కరోనా బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులు అందాయి. దీంతో మంత్రి హరీశ్ రావు క్వారంటైన్ కేంద్రం తనిఖీ చేశారు. కనీస వసతులు కల్పించకపోవడంతో తహసీల్దార్ మహిపాల్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో నగేష్‌పై కూడా మంత్రి హరీశ్‌రావు […]
దిశ, మెదక్: కరోనా బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పటాన్‌చెరు తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. పటాన్‌చెరు సమీపంలోని పాటి నారాయణ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో కరోనా బాధితులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఫిర్యాదులు అందాయి. దీంతో మంత్రి హరీశ్ రావు క్వారంటైన్ కేంద్రం తనిఖీ చేశారు. కనీస వసతులు కల్పించకపోవడంతో తహసీల్దార్ మహిపాల్‌రెడ్డిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఆర్డీవో నగేష్‌పై కూడా మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tags: Patancheru tahsildar, suspend, minister, harish rao, ts news