వన్డే, టీ20లకు ఆ ముగ్గురు దూరమా?

దిశ, స్పోర్ట్స్ : మరో పది రోజుల్లో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల అనంతరం మూడు టీ20ల సిరీస్ జరగనుంది. మొత్తం ఆరు మ్యాచ్‌లు రెండు వారాల్లో పూర్తి కానున్నాయి. దీంతో ఆస్ట్రేలియా జట్టు కీలకమైన ఆటగాళ్లను పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమ్మిన్స్‌లకు విశ్రాంతినివ్వాలని.. వారిని నాలుగు టెస్టులకు పరిమితం చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా అనుకుంటున్నది. ఈ ముగ్గురూ […]

Update: 2020-11-16 08:47 GMT

దిశ, స్పోర్ట్స్ : మరో పది రోజుల్లో ఆస్ట్రేలియా-ఇండియా మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మూడు వన్డేల అనంతరం మూడు టీ20ల సిరీస్ జరగనుంది. మొత్తం ఆరు మ్యాచ్‌లు రెండు వారాల్లో పూర్తి కానున్నాయి. దీంతో ఆస్ట్రేలియా జట్టు కీలకమైన ఆటగాళ్లను పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, ప్యాట్ కమ్మిన్స్‌లకు విశ్రాంతినివ్వాలని.. వారిని నాలుగు టెస్టులకు పరిమితం చేయాలని క్రికెట్ ఆస్ట్రేలియా అనుకుంటున్నది.

ఈ ముగ్గురూ ఆగస్టులో ఇంగ్లాండ్ పర్యటన వెళ్లి బయోబబుల్‌లో ఉన్నారు. అనంతరం ఐపీఎల్ కోసం యూఏఈ వచ్చి అక్కడ కూడా బయో సెక్యూర్ వాతావరణంలో ఉన్నారు. వరుసగా ఇన్ని నెలలు బయోసెక్యూర్ వాతావరణంలో ఉండటం వల్ల ఇబ్బందికి గురయ్యారు. ఇప్పుడు మరోసారి బయో బబుల్‌లో ఉండటం వారి ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రికెట్ ఆస్ట్రేలియా భావిస్తున్నది. దీంతో ఆ ముగ్గురికి విశ్రాంతి ఇవ్వాలని అనుకుంటున్నది. ఇందుకోసం ఆ ముగ్గురి ముందు ఈ ప్రతిపాదనను ఉంచింది. కానీ, ఎవరూ ఇంత వరకు సమాధానం చెప్పనట్లు సమాచారం. ‘తాను ఇంకా విశ్రాంతిపై ఏ నిర్ణయం తీసుకోలేదు. గత కొన్ని వారాలుగా అవిశ్రాంతంగా క్రికెట్ ఆడాను. కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు విశ్రాంతి తీసుకోవాలా వద్దా అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ అని ప్యాట్ కమ్మిన్స్ వ్యాఖ్యానించాడు.

Tags:    

Similar News