పీఎం కేర్స్‌కు పాట్ కమిన్స్ 50వేల డాలర్ల విరాళం
దిశ, స్పోర్ట్స్: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్ తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న ఆస్ట్రేలియన్ పేసర్ పీఎం కేర్స్‌కు 50 వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించాడు. ఈ మొత్తాన్ని దేశంలో కరోనాతో పోరాడుతున్న రోగుల కోసం ఆక్సిజన్ కొనుగోలుకు వినియోగించాలని కోరాడు. ఈ సందర్బంగా ట్విటర్‌లో ఒక సుదీర్ఘమైన సందేశాన్ని ఉంచాడు. pic.twitter.com/2TPkMmdWDE — Pat Cummins (@patcummins30) April 26, 2021 ‘నేను ఎన్నో ఏళ్లుగా ఇండియాను […]
దిశ, స్పోర్ట్స్: కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆల్‌రౌండర్ పాట్ కమిన్స్ తన మంచి మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతున్న ఆస్ట్రేలియన్ పేసర్ పీఎం కేర్స్‌కు 50 వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించాడు. ఈ మొత్తాన్ని దేశంలో కరోనాతో పోరాడుతున్న రోగుల కోసం ఆక్సిజన్ కొనుగోలుకు వినియోగించాలని కోరాడు. ఈ సందర్బంగా ట్విటర్‌లో ఒక సుదీర్ఘమైన సందేశాన్ని ఉంచాడు.
— Pat Cummins (@patcummins30) April 26, 2021
‘నేను ఎన్నో ఏళ్లుగా ఇండియాను ప్రేమిస్తున్నాను. ఇక్కడ ప్రజలు దయ, మంచి మనసు కలిగిన వారు. అలాంటి ప్రజలు ఇప్పుడు బాధలో ఉన్నారని తెలియడంతో నా మనసు చాలా బాధపడుతున్నది. ఇలాంటి సమయంలో ఐపీఎల్ ఆడటం అవసరమా అని చాలా మంది అంటున్నారు. అయితే బాధకరమైన సమయంలో ఐపీఎల్ ద్వారా ప్రజలు కొద్దిగా ఊరట పొందుతున్నారు. అలాగే ప్రస్తుతం దేశంలో ఆక్సిజన్ కొరత ఉన్నదని తెలుసుకున్నాను. నా వంతు సాయంగా 50 వేల డాలర్ల సాయాన్ని పీఎం కేర్స్‌కు అందిస్తున్నాను. నా తోటి క్రికెటర్లు, ఇంకా ఇతరులు కూడా ముందుకు వచ్చి సాయం చేయాలి’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు.