పాస్‌వర్డ్ లేకుండా బ్రౌజర్ లాగిన్!
ఈ ఏడాది ప్రారంభంలో యాపిల్ సంస్థ, ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్‌లైన్ అలయన్స్‌తో చేరింది. ఈ అలయన్స్ పాస్‌వర్డ్ లేకుండా అథెంటికేషన్‌కు మద్దతునిచ్చేది. ఇందులో చేరిన తర్వాత మొదటిసారిగా ఒక కొత్త సదుపాయాన్ని తమ సఫారీ బ్రౌజర్‌లో తీసుకురాబోతున్నట్లు ప్రకటన చేసింది. త్వరలో రాబోతున్న సఫారీ 14లో పాస్‌వర్డ్ లేని అథెంటికేషన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. డబ్ల్యూడబ్ల్యూడీసీ డెవలపర్ కాన్ఫరెన్స్ యాపిల్ ఈ విషయాన్ని వెల్లడించింది. దీని వల్ల బ్రౌజర్ లాగిన్ మరింత సులభతరం కానుంది. ఐఫోన్‌లో ఫేస్ ఐడీ […]
ఈ ఏడాది ప్రారంభంలో యాపిల్ సంస్థ, ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్‌లైన్ అలయన్స్‌తో చేరింది. ఈ అలయన్స్ పాస్‌వర్డ్ లేకుండా అథెంటికేషన్‌కు మద్దతునిచ్చేది. ఇందులో చేరిన తర్వాత మొదటిసారిగా ఒక కొత్త సదుపాయాన్ని తమ సఫారీ బ్రౌజర్‌లో తీసుకురాబోతున్నట్లు ప్రకటన చేసింది. త్వరలో రాబోతున్న సఫారీ 14లో పాస్‌వర్డ్ లేని అథెంటికేషన్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. డబ్ల్యూడబ్ల్యూడీసీ డెవలపర్ కాన్ఫరెన్స్ యాపిల్ ఈ విషయాన్ని వెల్లడించింది. దీని వల్ల బ్రౌజర్ లాగిన్ మరింత సులభతరం కానుంది.
ఐఫోన్‌లో ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ ద్వారా సఫారీ బ్రౌజర్‌లో వెబ్‌సైట్లలో లాగిన్ అవొచ్చు. అదనంగా, ఎఫ్‌ఐడీఓ ప్రమాణాలతో హార్డ్‌వేర్ సెక్యూరిటీ కీస్‌ను సపోర్టు చేసే వాటిని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పటికే కీచెయిన్ ద్వారా ఫేస్ ఐడీ, టచ్ ఐడీ ఉపయోగించి యాప్స్‌లో సైన్‌ఇన్ అయ్యే అవకాశాన్ని యాపిల్ అందిస్తోంది. సఫారీ 14లో ఈ అవకాశం ఐఓఎస్ 14, మాక్ ఓఎస్ 11.0 ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఐఫోన్లలో వాడే వెబ్ అథెంటికేషన్ ప్రమాణాలు మల్టీ-ఫ్యాక్టర్ అథెంటికేషన్‌ను అందిస్తాయి. మొదట ఐఫోన్ సెక్యూరిటీ, తర్వాత ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీ బయోమెట్రిక్స్‌తో రెండంచెల రక్షణ లభిస్తుంది. తద్వారా ఫిషింగ్ ఎటాక్ అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఇప్పటికే ఈ సదుపాయాన్ని గూగుల్, ఆండ్రాయిడ్, విండోస్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లు అందజేస్తుండటం గమనార్హం.