పూర్తి స్థాయిలో పనిచేయలేం :పాస్‌పోర్టు సేవా కేంద్రం
దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెలకొన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పాస్‌పోర్టు సేవా కేంద్రం తమ సేవలను తగ్గించింది. రెగ్యులర్ పాస్‌పోర్టు కోసం చేసుకునే కొత్త దరఖాస్తులతో పాటు తత్కాల్ లాంటి అత్యవసర పాస్‌పోర్టుల జారీ పనులను సగానికి తగ్గించుకుంటున్నామని, యాభై శాతం సర్వీసులను మాత్రమే అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా కొత్త దరఖాస్తులు, రెన్యూవల్స్ , […]
దిశ, తెలంగాణ బ్యూరో : దేశంలోనూ, రాష్ట్రంలోనూ నెలకొన్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని పాస్‌పోర్టు సేవా కేంద్రం తమ సేవలను తగ్గించింది. రెగ్యులర్ పాస్‌పోర్టు కోసం చేసుకునే కొత్త దరఖాస్తులతో పాటు తత్కాల్ లాంటి అత్యవసర పాస్‌పోర్టుల జారీ పనులను సగానికి తగ్గించుకుంటున్నామని, యాభై శాతం సర్వీసులను మాత్రమే అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు రీజినల్ పాస్‌పోర్టు ఆఫీసర్ దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కారణంగా కొత్త దరఖాస్తులు, రెన్యూవల్స్ , తత్కాల్ దరఖాస్తుల పరిశీలనకు సమయం పట్టవచ్చని, గతంలోలాగా సకాలంలో పరిశీలన, పరిష్కారం కాకపోవచ్చని పేర్కొన్నారు. దీనికి తోడు దరఖాస్తుదారుల సందేహాలను నివృత్తి చేయడం కోసం పనిచేస్తున్న పబ్లిక్ ఎంక్వయిరీ కౌంటర్ సైతం ప్రతీరోజు మధ్యాహ్నం 3.30 గంటల వరకు పనిచేయాల్సి ఉన్నా కేవలం 11.30 గంటల వరకు మాత్రమే ఉంటుందని, ఉదయం 9.30 గంటల నుంచి రెండు గంటల పాటు మాత్రమే సేవలందించగలుగుతామన్నారు. తక్షణం ఇది అమలులోకి వచ్చిందని, తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంతవరకు అమలులో ఉంటుందన్నారు.