బీజేపీ ఎమ్మెల్యేకు పార్టీ చీఫ్ జేపీ నడ్డా వార్నింగ్

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బలియా జిల్లాలో పోలీసులు, అధికారుల ముందే గతవారం తుపాకీతో కాల్పులు జరిపి ఓ వ్యక్తిని హతమార్చిన స్థానిక బీజేపీ నేతకు మద్దతునిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌పై పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. షోకాజు నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని యూపీ బీజేపీ చీఫ్‌ స్వతంత్ర దేవ్ సింగ్‌కు ఆదేశించారు. రేషణ్ షాప్ కేటాయింపులో ఏర్పడ్డ ఘర్షణలో నిందితుడు ధీరేంద్ర సింగ్.. జయ ప్రకాష్‌పై కాల్పులు […]

Update: 2020-10-19 08:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ బలియా జిల్లాలో పోలీసులు, అధికారుల ముందే గతవారం తుపాకీతో కాల్పులు జరిపి ఓ వ్యక్తిని హతమార్చిన స్థానిక బీజేపీ నేతకు మద్దతునిచ్చిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌పై పార్టీ చీఫ్ జేపీ నడ్డా ఫైర్ అయ్యారు. షోకాజు నోటీసులు జారీ చేసి వివరణ తీసుకోవాలని యూపీ బీజేపీ చీఫ్‌ స్వతంత్ర దేవ్ సింగ్‌కు ఆదేశించారు.

రేషణ్ షాప్ కేటాయింపులో ఏర్పడ్డ ఘర్షణలో నిందితుడు ధీరేంద్ర సింగ్.. జయ ప్రకాష్‌పై కాల్పులు జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినప్పటికీ సదరు నిందితుడు ప్రాణాలను రక్షించుకునే క్రమంలో షూట్ చేశారని, దర్యాప్తు ఏకపక్షంగా సాగుతున్నదని బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అధికారులపై ఆరోపణలు చేశారు. ఈ ఘటనపై స్పందిస్తూ సదరు ఎమ్మెల్యే కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోవద్దని నడ్డా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ప్రవర్తన విషయమై రాష్ట్ర బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్‌పై ఆగ్రహించారు.

Tags:    

Similar News