ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చే పార్టీలను బొంద పెట్టాలి: మాల మహానాడు

దిశ, లింగాల: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆదేశాల మేరకు బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో మాలల సమావేశనీ ఏర్పాటు చేశారు. మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి చిన్న వెంకటేష్ ఆధ్వర్యంలో మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. మాలలు అందరూ ఎస్ సి వర్గీకరణ కు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చే పార్టీలను మాలలు […]

Update: 2021-12-22 06:20 GMT

దిశ, లింగాల: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆదేశాల మేరకు బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో మాలల సమావేశనీ ఏర్పాటు చేశారు. మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి చిన్న వెంకటేష్ ఆధ్వర్యంలో మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ.. మాలలు అందరూ ఎస్ సి వర్గీకరణ కు వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చే పార్టీలను మాలలు బొంద పెట్టాలని ఆయన కోరారు. మండల అధ్యక్షులుగా గట్టు కురుమయ్య, ప్రధాన కార్యదర్శిగా యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా శేఖర్, ఉపాధ్యక్షులుగా చింత మల్లేష్, తగిలి వీరాస్వామి, కోశాధికారిగా మల్లేష్, ప్రచార కార్యదర్శి గా హేమాద్రి, తగిలి మల్లేష్, కార్యదర్శులుగా బాలకృష్ణ, పర్వతయ్య తో పాటు పలువురు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.

Tags:    

Similar News