కొవిడ్‌పై అవగాహన.. ‘పరోటా మాస్క్‌ల’ ప్రయోగం

దిశ, వెబ్‌డెస్క్: క‌రోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఓ వైపు రిక‌వ‌రీ రేటు పెరుగుతున్నా పాజిటివ్ కేసులు భారీగా న‌మోద‌వుతుండ‌టం అంద‌రినీ క‌ల‌వ‌రపెడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రాకుండా అడ్డుకునేవి.. మాస్క్‌లు. అలా అని మాస్క్ ధరించి గుంపులో తిరిగితే.. ఎటువంటి లాభం ఉండదు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. మన జాగ్రత్తల్లో మనం ఉన్నప్పుడే కరోనా మహమ్మారిని అదుపు చేయొచ్చు. ఇక మాస్క్‌లు ధరించని వారి పట్ల ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరిస్తోంది. వారికి […]

Update: 2020-07-09 02:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: క‌రోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఓ వైపు రిక‌వ‌రీ రేటు పెరుగుతున్నా పాజిటివ్ కేసులు భారీగా న‌మోద‌వుతుండ‌టం అంద‌రినీ క‌ల‌వ‌రపెడుతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా రాకుండా అడ్డుకునేవి.. మాస్క్‌లు. అలా అని మాస్క్ ధరించి గుంపులో తిరిగితే.. ఎటువంటి లాభం ఉండదు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. మన జాగ్రత్తల్లో మనం ఉన్నప్పుడే కరోనా మహమ్మారిని అదుపు చేయొచ్చు. ఇక మాస్క్‌లు ధరించని వారి పట్ల ప్రభుత్వం కూడా కఠినంగానే వ్యవహరిస్తోంది. వారికి జరిమానాలు విధిస్తోంది. అయినా కొందరు కొవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను అస్స‌లు పాటించ‌డం లేదు. అలాంటి వారికి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం కోసం మ‌ధురైలోని ఓ రెస్టారెంట్ వినూత్న ఆలోచన చేసింది.

ప్రస్తుతానికి మాస్కుల్లో చాలా రకాలున్నాయి. ఫ్యాషన్ డిజైనర్లు కూడా ట్రెండీ మాస్క్‌లను తయారు రూపొందిస్తున్నారు. కానీ ఈ రెస్టారెంట్ తయారుచేసిన మాస్క్ మాత్రం చాలా భిన్నం. ఎందుకంటే.. ఇది మూతికి పెట్టుకునేది కాదు.. నోటికి రుచించేది. ప్రజల్లో అవగాహన పెంచేది. అవే కరోనా నేపథ్యంలో ప్రత్యేకంగా మాస్క్ ఆకారంలో రూపొందించిన పరాటాలు. కరోనా విజృంభిస్తున్న టైమ్‌లో మాస్క్ ప్రాధాన్యాన్ని, మాస్క్ తప్పక ధరించాలనే అవగాహన కల్పించేందుకు మ‌ధురైలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు ‘మాస్క్ పరాటా’లను తయారుచేశారు. వీటి ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. తమిళనాడుకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సోషల్ మీడియాలో ఈ పరాటా మాస్క్ పిక్స్ షేర్ చేయడంతో మరింత వైరల్ అయ్యాయి.

‘మ‌దురై వ్యాప్తంగా ప్ర‌స్తుతం లాక్‌డౌన్ అమ‌ల‌వుతోంది. ఇప్పటికీ చాలా మంది మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం లేదు. అలాంటి వారిలో చైత‌న్యం క‌లిగించేందుకే వీటిని తయారు చేశాం. ఇటీవలే మదురై జిల్లాలో లాక్‌డౌన్ సడలించడంతో రెస్టారెంట్ ఓపెన్ చేశాం, అయితే కస్టమర్స్ మాస్క్ ధరించకుండా రెస్టారెంట్‌లోకి వస్తుండటంతో, వారికి ఉచితంగా మాస్క్‌లు ఇచ్చాం. ఇప్పటికీ ఇస్తున్నాం’ అని రెస్టారెంట్ ఓనర్ తెలిపారు.

ముంబై, ఢిల్లీ తర్వాత అత్యధిక కేసులు తమిళనాడులోనే నమోదువుతున్నాయి. కాగా ఆ రాష్ట్రంలో చెన్నై తర్వాత కరోనా కేసులు అధికంగా ఉన్న రెండో జిల్లాగా మధురై నిలిచింది.

Tags:    

Similar News