అమిత్ షా ఖాతాను ఎందుకు బ్లాక్ చేశారు

న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖాతాలను ఎందును నిలిపివేశారని సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ప్రతినిధులను పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించింది. అందుకు గల కారణాలను తెలుపాలని ఆదేశించింది. పౌరుల హక్కులను పరిరక్షించడం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ల దుర్వినియోగం నిరోధించడం, డిజిటల్ స్పేస్‌లో మహిళల భద్రతపై గురువారం ఫేస్‌బుక్, ట్విట్టర్ ప్రతినిధులతో పార్లమెంటరీ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతాను […]

Update: 2021-01-21 11:33 GMT

న్యూఢిల్లీ : గత ఏడాది నవంబర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖాతాలను ఎందును నిలిపివేశారని సోషల్ మీడియా దిగ్గజ సంస్థలు ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ప్రతినిధులను పార్లమెంటరీ కమిటీ ప్రశ్నించింది. అందుకు గల కారణాలను తెలుపాలని ఆదేశించింది. పౌరుల హక్కులను పరిరక్షించడం, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ల దుర్వినియోగం నిరోధించడం, డిజిటల్ స్పేస్‌లో మహిళల భద్రతపై గురువారం ఫేస్‌బుక్, ట్విట్టర్ ప్రతినిధులతో పార్లమెంటరీ కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.

కానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ఖాతాను ఎందుకు నిలిపివేశారని, అలా చేయడానికి ఆ హక్కు ఎవరు ఇచ్చారని ఆ సంస్థల ప్రతినిధులను కమిటీ సభ్యులు ప్రశ్నించారు. అమిత్ షా ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసిన ఫొటో కారణంగా కాపీ రైట్ సమస్య తలెత్తిందని, అందువల్ల తాత్కాలికంగా ఖాతాను నిలిపివేశామని ట్విట్టర్ ప్రతినిధులు వివరించారు. వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని, ప్రస్తుత ఆయన ఖాతా పూర్తిస్థాయిలో పనిచేస్తున్నదని తెలిపారు.

Tags:    

Similar News