నేటి నుంచి సభా సమరం..
దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉభయ సభలను నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ శాఖ వెల్లడించింది. కరోనా టెస్టులు చేయించుకుని నెగెటివ్ వచ్చిన సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే ప్రకటించారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు లోక్‌సభ.. మరల 3గంటల నుంచి రాత్రి 7వరకు రాజ్యసభను నిర్వహించనున్నారు. ఒక సభ జరిగే సమయంలో ఇంకోసభ జరగదు. […]
దిశ, వెబ్‌డెస్క్ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉభయ సభలను నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ శాఖ వెల్లడించింది. కరోనా టెస్టులు చేయించుకుని నెగెటివ్ వచ్చిన సభ్యులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఇప్పటికే ప్రకటించారు.
ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు లోక్‌సభ.. మరల 3గంటల నుంచి రాత్రి 7వరకు రాజ్యసభను నిర్వహించనున్నారు. ఒక సభ జరిగే సమయంలో ఇంకోసభ జరగదు. సభలో సభ్యులు వ్యవహరించాల్సిన తీరు, భౌతికదూరం వంటి నిబంధనలను డిజిటల్ రూపంలో పొందుపరిచారు.