పార్లమెంట్ వర్కర్‌కు కరోనా పాజిటివ్
న్యూఢిల్లీ : లోక్ సభ సెక్రెటేరియట్ వర్కర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ హౌజ్ కీపింగ్ వర్కర్ కొన్నాళ్లుగా విధులకు రావడం లేదు. తీవ్ర జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా, ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో.. ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్‌కు తరలించారు. వర్కర్ కుటుంబాన్ని ఐసొలేషన్‌లో ఉంచారు. మరో 11 మందిని కరోనా టెస్టులు నిర్వహించారు. ఫలితాలు రావలసి ఉంది. కాగా, ఈయనకు కాంటాక్టులోకి వచ్చినవారి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. […]
న్యూఢిల్లీ : లోక్ సభ సెక్రెటేరియట్ వర్కర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ హౌజ్ కీపింగ్ వర్కర్ కొన్నాళ్లుగా విధులకు రావడం లేదు. తీవ్ర జ్వరం, దగ్గు, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా, ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో.. ఢిల్లీలోని ఆర్ఎంఎల్ హాస్పిటల్‌కు తరలించారు. వర్కర్ కుటుంబాన్ని ఐసొలేషన్‌లో ఉంచారు. మరో 11 మందిని కరోనా టెస్టులు నిర్వహించారు. ఫలితాలు రావలసి ఉంది. కాగా, ఈయనకు కాంటాక్టులోకి వచ్చినవారి వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా.. ఇదే రోజు రాష్ట్రపతి భవన్‌లో పనిచేస్తున్న ఓ వర్కర్ కుటుంబంలో కరోనా వైరస్ పాజిటివ్ తేలిన సంగతి తెలిసిందే.
Tags: parliament, worker, isolation, positive, house keeping, cough, rml hospital