ఒంటరిగా క్వారంటైన్ కష్టమే : పరిణీతి
లాక్ డౌన్ అందరికీ ఒకేలా ఉండదు.. ధనవంతులకు ఆనందం ఇవ్వొచ్చు.. బిజీ షెడ్యూల్స్ కు బ్రేక్ ఇస్తూ కుటుంబంతో విలువైన సమయాన్ని గడిపే చాన్స్ ఇవ్వొచ్చు .. కానీ, పేదలకు లాక్ డౌన్ ఇచ్చిన బహుమతి ఆకలి.. సహాయం కోసం ఎదురుచూపులు. ఆ సహాయం అందకపోతే ఆకలితో అలమటిస్తూనే నిద్రించే రాత్రులు. అయితే ఎంత ధనం ఉన్నా సరే.. మనల్ని ప్రేమించే వారు లేకపోతే ఈ లాక్ డౌన్ ను ఒంటరిగా ఫేస్ చేయడం చాలా కష్టం […]
లాక్ డౌన్ అందరికీ ఒకేలా ఉండదు.. ధనవంతులకు ఆనందం ఇవ్వొచ్చు.. బిజీ షెడ్యూల్స్ కు బ్రేక్ ఇస్తూ కుటుంబంతో విలువైన సమయాన్ని గడిపే చాన్స్ ఇవ్వొచ్చు .. కానీ, పేదలకు లాక్ డౌన్ ఇచ్చిన బహుమతి ఆకలి.. సహాయం కోసం ఎదురుచూపులు. ఆ సహాయం అందకపోతే ఆకలితో అలమటిస్తూనే నిద్రించే రాత్రులు.
అయితే ఎంత ధనం ఉన్నా సరే.. మనల్ని ప్రేమించే వారు లేకపోతే ఈ లాక్ డౌన్ ను ఒంటరిగా ఫేస్ చేయడం చాలా కష్టం అంటుంది బాలీవుడ్ భామ పరిణీతి చోప్రా. తన ఆప్తులు.. రోజు నా ఆకలి తీర్చేందుకు ఇంటికి ఆహారం పంపించారని.. తిన్నానా లేదా అని ఒకటికి రెండు సార్లు కాల్ చేసి మరీ కనుక్కున్నారు అని చెప్తోంది. కారణం నాకు వంట చేయడం రాదు అంటోంది. ఇలాంటి వారు నా లైఫ్ లో ఉండడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను అని చెప్తుంది. మనుషులను ఎంత గొప్పగా ప్రేమించ వచ్చో చేసి చూపారని అంటోంది. ఈ పోస్ట్ పై స్పందించిన సోనమ్ కపూర్ వర్చువల్ హగ్స్ పంపించగా.. స్వీట్ సోనమ్ లవ్ యూ అని చెప్పింది పరిణీతి.