‘శ్రీ చైతన్య’ గుర్తింపు రద్దుకు నిరసన
దిశ, నిజామాబాద్ : తోక పేర్లు, తప్పుడు ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తోన్న ‘శ్రీ చైతన్య పాఠశాల’ గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ..విద్యా సంవత్సరం మొదలు కాకముందే అనుమతి లేకుండా అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నల్ల నవీన్, రాకేష్, నగర కార్యదర్శి […]
దిశ, నిజామాబాద్ : తోక పేర్లు, తప్పుడు ప్రకటనలతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తోన్న ‘శ్రీ చైతన్య పాఠశాల’ గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ..విద్యా సంవత్సరం మొదలు కాకముందే అనుమతి లేకుండా అడ్మిషన్ల పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా కన్వీనర్ నల్ల నవీన్, రాకేష్, నగర కార్యదర్శి శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు విజ్ఞాన్, ప్రవీణ్, అక్షయ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.