రెగ్యులరైజ్​ చేయండి.. లేకపోతే సమ్మె చేస్తాం

దిశ,​ సికింద్రాబాద్​: గాంధీ ఆసుపత్రిలో గత కొన్నేండ్లుగా తక్కువ జీతాలతో, అభద్రత భావంతో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్​ చేయాలని కోరుతూ ఔట్​సోర్సింగ్​ పారామెడికల్​ సిబ్బంది మంగళవారం గాంధీ సూపరింటెండెంట్​ రాజారావుకు వినతిపత్రం అందచేశారు. ఈ మేరకు వీరు సీఎం కేసీఆర్​, మంత్రి ఈటల రాజేందర్‌కు లేఖలు పంపారు. అనంతరం వీరు మాట్లాడుతూ.. గాంధీలో మొత్తం 42మంది పారామెడికల్, 35 మంది కంప్యూటర్​ ఆపరేటర్స్​ ఔట్​సోర్సింగ్​ కింద పనిచేస్తున్నారన్నారు. ప్రస్తుత కరోనా పీరియడ్​లో చాలీచాలని జీతాలతో అనేక ఇబ్బందులు […]

Update: 2020-07-14 08:30 GMT

దిశ,​ సికింద్రాబాద్​: గాంధీ ఆసుపత్రిలో గత కొన్నేండ్లుగా తక్కువ జీతాలతో, అభద్రత భావంతో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్​ చేయాలని కోరుతూ ఔట్​సోర్సింగ్​ పారామెడికల్​ సిబ్బంది మంగళవారం గాంధీ సూపరింటెండెంట్​ రాజారావుకు వినతిపత్రం అందచేశారు. ఈ మేరకు వీరు సీఎం కేసీఆర్​, మంత్రి ఈటల రాజేందర్‌కు లేఖలు పంపారు. అనంతరం వీరు మాట్లాడుతూ.. గాంధీలో మొత్తం 42మంది పారామెడికల్, 35 మంది కంప్యూటర్​ ఆపరేటర్స్​ ఔట్​సోర్సింగ్​ కింద పనిచేస్తున్నారన్నారు. ప్రస్తుత కరోనా పీరియడ్​లో చాలీచాలని జీతాలతో అనేక ఇబ్బందులు పడుతున్నామని, ఇంటి అద్దెలు కట్టలేక, కుటంబపోషణ చాలా కష్టమవుతుందన్నారు. గత15 ఏండ్లుగా తక్కువ జీతాలతో పనిచేస్తున్న తాము ప్రస్తుతం కరోనా నేపథ్యంలో గాంధీలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని డ్యూటీలు చేస్తున్నామని వారు వాపోయారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఔట్​సోర్సింగ్​ సిబ్బందిని పర్మినెంట్​ చేస్తూ జీతం కనీసం రూ.30వేలకు పెంచాలని కోరారు. సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. లేనిపక్షంలో త్వరలోనే మూకుమ్ముడిగా సమ్మెకు దిగుతామన్నారు.

Tags:    

Similar News