పారా ఒలింపిక్స్: విధిని ఎదురించి పతకమే లక్ష్యంగా.. ఇండియన్ ప్లేయర్స్
దిశ, ఫీచర్స్ : విశ్వక్రీడల సంరంభం ముగిసింది. భారత్ గత రికార్డులు తిరగరాస్తూ ఈసారి అత్యధిక పతకాలు సొంతం చేసుకుని మువ్వన్నెలు రెపరెపలాడించింది. అలాగే ఆగస్టు 25నుంచి ప్రారంభం కాబోతున్న పారా ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటేందుకు భారత క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ ఏ గేమ్ అయినా సరే ప్రతీ అథ్లెట్‌లో అద్భుతమైన పోరాటంతో పాటు పతకాన్ని సాధించాలనే దృఢ సంకల్పం ఉంటుంది. అదే పట్టుదలతో జీవితంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఇండియాకు ప్రాతినిధ్యం […]
దిశ, ఫీచర్స్ : విశ్వక్రీడల సంరంభం ముగిసింది. భారత్ గత రికార్డులు తిరగరాస్తూ ఈసారి అత్యధిక పతకాలు సొంతం చేసుకుని మువ్వన్నెలు రెపరెపలాడించింది. అలాగే ఆగస్టు 25నుంచి ప్రారంభం కాబోతున్న పారా ఒలింపిక్స్‌లోనూ సత్తా చాటేందుకు భారత క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్, బ్యాడ్మింటన్ ఏ గేమ్ అయినా సరే ప్రతీ అథ్లెట్‌లో అద్భుతమైన పోరాటంతో పాటు పతకాన్ని సాధించాలనే దృఢ సంకల్పం ఉంటుంది. అదే పట్టుదలతో జీవితంలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారుల స్ఫూర్తిదాయకమైన కథలు మీకోసం..
రియో డి జనీరో పారా ఒలింపిక్స్‌లో రెండు బంగారు పతకాలతో పాటు, ఒక రజతం, ఓ కాంస్యంతో పారా అథ్లెట్స్ యావత్ భారతీయ క్రీడాభిమానులకు ఆనందాన్ని పంచారు. లండన్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో 10మంది మాత్రమే పాల్గొనగా, 2016లో ఆ సంఖ్య 19కు చేరుకుంది. ఈసారి మరిన్ని పతకాలు ఒడిసిపట్టేందుకు ఆ సంఖ్య రెట్టింపు కాగా ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, కానోయింగ్, షూటింగ్, స్విమ్మింగ్, పవర్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, తైక్వాండో వంటి తొమ్మిది పారా క్రీడల్లో 54 మంది అథ్లెట్లతో భారత్ అతిపెద్ద బృందాన్ని రంగంలోకి దింపుతోంది. అంతర్జాతీయ స్థాయిలో ఇటీవల సాధించిన విజయాలను బట్టి పారా ఒలింపియన్‌లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని క్రీడాభిమానులు, విశ్లేషకులు భావిస్తున్నారు.
పాలక్ కోహ్లీ – బ్యాడ్మింటన్
సకీనా ఖాతున్ – పవర్ లిఫ్టింగ్
జ్యోతి బలియాన్ – విలువిద్య
అవని లేఖరా – షూటింగ్
అరుణ తన్వర్ – తైక్వాండో
రెండు చేతుల్లోనూ వైకల్యంతో పుట్టిన అరుణను ఇతర పిల్లల్లాగే పెంచాడు తండ్రి. 2008లో మార్షల్ ఆర్ట్స్ క్లాస్‌లో చేరతానని పేరెంట్స్‌కు చెప్పగా.. వారు ఆమె నిర్ణయానికి మద్ధతిచ్చారు. ఈ క్రమంలోనే రాబోయే టోక్యో పారాలింపిక్స్‌కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ పొందిన భారతదేశపు మొట్టమొదటి తైక్వాండో క్రీడాకారిణిగా నిలిచింది. గత కొన్నేళ్లుగా స్థిరమైన ప్రదర్శన చేస్తున్న అరుణ, టర్కీలో జరిగిన వరల్డ్ పారా తైక్వాండో చాంపియన్‌షిప్ 2019లో కాంస్య పతకం, జోర్డాన్‌లో జరిగిన ఏషియన్ పారా తైక్వాండో చాంపియన్‌షిప్-2019లో మరో కాంస్య పతకం గెలుచుకుంది.
రూబీనా ఫ్రాన్సిస్ (షూటింగ్), ప్రమోద్ భగత్(పారా బ్యా్డ్మింటన్), పారుల్ పర్మార్ (పారా బ్యా్డ్మింటన్), మనీష్ నర్వాల్ (షూటింగ్), కశిష్ లక్రా (క్లబ్ త్రో) వంటి ప్లేయర్స్ తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక స్వర్ణపతక విజేతలు దేవేంద్ర జజారియా, మరియప్పన్ తంగవేలు ఇద్దరూ తమ రియో 2016 టైటిళ్లను కాపాడుకోవడానికి టోక్యోకు వెళ్లారు. జావెలిన్ త్రో మరోసారి భారతీయ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తుంది. సుమిత్ ఆంటిల్, సందీప్ చౌదరి అత్యుత్తమ ఆటతీరుతో పతకం ఖాయం చేసేలా కనిపిస్తున్నారు. ఇక ఆటల జాబితాలో బ్యాడ్మింటన్ జోడించడం భారతదేశ పతక ఆశలకు మరింత ఊతమిచ్చింది.