మీరు ఇలాగే సహకరిస్తే మున్సిపాలిటీ చేస్తా.. పరకాల ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
దిశ, ఆత్మకూర్: ఆత్మకూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రూ.17 లక్షలతో నిర్మించిన వ్యాపార సముదాయాన్ని ఎమ్మెల్యే చల్లా ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ పర్వతగిరి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆత్మకూరు అభివృద్ధి నోచుకోలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. […]
దిశ, ఆత్మకూర్: ఆత్మకూరును అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో రూ.17 లక్షలతో నిర్మించిన వ్యాపార సముదాయాన్ని ఎమ్మెల్యే చల్లా ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ పర్వతగిరి రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆత్మకూరు అభివృద్ధి నోచుకోలేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం మరువలేనిదని ప్రశంసించారు.
ఇలాగే సహకరిస్తే ఆత్మకూరు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు. కాకతీయ టెక్స్‌టైల్ పార్కు ఎన్నో ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షిస్తోందని అన్నారు. అనంతరం ఆత్మకూరు మండలం అక్కంపేట(ముత్యాలపల్లి) శివారులోని జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ సుమలత, జెడ్పీటీసీ రాధిక రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి, ఉపాధ్యక్షులు కుమారస్వామి, ఉపసర్పంచ్ స్వాతి భగవాన్ రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు రవీందర్, ఉపాధ్యక్షులు రమేష్, గుడెప్పాడు ఏఎంసీ చైర్మన్ కేశవరెడ్డి, నాయకులు రవీందర్, రాజస్వామి పాల్గొన్నారు.